2015

వరద బాధితులకు మంచినీరు,ఆహారం పంపిణీ..

వరద బాధితులకు సిపిఎం అపన్నహస్తం అందించింది. నెల్లూరు నగరంలో బాధితులకు స్వయంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు నేతృత్వంలో సాయం అందజేశారు. నాయకులు నడుముల్లోతు నీళ్లలోనే వెళ్లి బాధితులను పరామర్శించారు. వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. ఆహారపొట్లాలు, మంచీనీటి ప్యాకెట్లు, కొవ్వొత్తులు అందించారు.ఐదురోజులుగా నగరంలోని సుమారు 30 వేల ఇళ్లు నీటిలోనే ఉండడం పట్ల మధు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తం అందించేందుకు సిపిఎం ముందుంటుందన్నారు. అధికారుల మధ్య సమన్వయ లోపం వల్లే వరద సంభవించిందన్నారు. ముందస్తు సమాచారం లేకుండా నెల్లూరు చెరువు గేటు ఎత్తేశారని అన్నారు.

'బాక్సైట్‌' ఒప్పందాలు రద్దయ్యేవరకూ పోరాటం- 30న చింతపల్లి గిరిజన గర్జన సభకు బృందాకరత్‌ రాక- సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుల నర్సింగరావు

బాక్సైట్‌ తవ్వకాలకు ఆంధ్రప్రదేశ్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎపిఎండిసి)కి అనుమతులు మంజూరు చేస్తూ జారీ చేసిన జిఒ 97, బాక్సైట్‌ ఒప్పందా లను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసే వరకూ పోరాటం కొనసాగుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ నర్సింగరావు తెలిపారు. ఏజెన్సీలో గ్రామ సభలు నిర్వహించడం, అటవీ హక్కులచట్టం కింద సాగుదారులకు హక్కుపత్రాలు మంజూరు చేయడం వంటి డిమాండ్ల సాధనకు క్షేత్రస్థాయిలో పోరాటం ఉధృతం చేస్తామ న్నారు.

రూ.1810 కోట్ల FDIలకు ఆమోదం..

మోడీ ప్రభుత్వం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల అనుమతులను వేగవంతం చేస్తోంది. తాజాగా రూ.1,810.25 కోట్ల విలువ చేసే ఆరు ఎఫ్‌డిఐ ప్రతిపాదనలకు కేంద్ర ఫారిన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు ఆమోదం తెలిపింది. అక్టోబర్‌ 30న జరిగిన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

99 ఏళ్లకు ప్రభుత్వ భూముల లీజు...

ఏపీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ ఎనేబ్లింగ్‌ యాక్ట్‌ ప్రకారం.. ప్రభుత్వ భూమిని 33 సంవత్సరాలకు మాత్రమే లీజుకు ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ లీజు పరిమితి పెంచాలన్నా.. గరిష్ఠంగా 11 సంవత్సరాలు చొప్పున ఓ రెండుసార్లు మాత్రమే పొడిగించ వచ్చు. అంటే.. ఎట్టి పరిస్థితుల్లోనూ 55 సంవత్సరాలకు మించి... ఏ ప్రభుత్వ భూమినీ ఏ సంస్థకూ లీజుకు ఇవ్వడానికి వీలు లేదు. కానీ.. కార్పొరేట్‌ శక్తుల ప్రేమలో తలదాకా కూరుకు పోయిన చంద్రబాబు సర్కారు.. లీజు గడువును ఏకంగా 99 సంవత్సరాలకు పెంచేసింది.

ఆంధ్రప్రదేశ్‌లో రహస్య పాలన.!

ఆంధ్రప్రదేశ్‌లో 'రహస్య' పాలన సాగుతోంది. పారదర్శకంగా ఉండాల్సిన సర్కారు ఉత్తర్వులు 'రహస్య' జాబితాలో చేరి పోతున్నాయి. ప్రభుత్వ సమాచారం, జీవోలు ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు ఆన్‌లైన్‌లో జీవోలు పెట్టాలి. ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాలి. కొన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించి జారీ చేశామంటున్న జీవోల పక్కన 'కాన్ఫిడెన్షియల్‌' అని కనబడుతుంది. ఫైల్‌పై క్లిక్‌ చేస్తే తెల్లగా ఉంటుంది తప్ప వివరాలుండవు. జీవో నెంబర్‌, జారీ చేసిన తేదీ మాత్రం ఉంటుంది.

GSTవల్ల రెండు వేలకోట్లు నష్టం..

వస్తుసేవల పన్ను రాష్ట్రాల పరిధిలో ఉండేదని, ఇప్పుడు కేంద్రం జిఎస్టీ బిల్లు తీసుకొచ్చి రాష్ట్రాల హక్కు లను హరిస్తోందని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్టుడు పేర్కొన్నారు. వస్తు సేవల పన్నుపై కేంద్ర, రాష్ట్రాలకు హామీ ఇవ్వకపోవడం దారుణమని పేర్కొన్నారు. 

ఉగ్రవాదానికి అగ్రరాజ్యాలే ఆజ్యం..

ప్రపంచంలో కొన్ని అగ్రదేశాలు అనుసరిస్తున్న విధానాలే ప్రస్తుతం అన్ని దేశాలను వణికిస్తున్న ఉగ్రవాదానికి ఆజ్యం పోస్తున్నాయని సిపిఎం అధికార పత్రిక పీపుల్స్‌ డెమొక్రసీ తన తాజాసంచిక సంపాదకీయంలో విమర్శించింది. ప్రస్తుతం ప్రపం చం అంతా ఉగ్రవాదం నుండి పెనుముప్పును ఎదు ర్కొంటున్నదని, ఈ పెనుభూతాన్ని తరిమికొట్టి నిర్మూలించాలన్న విషయంలో ఎటువంటి సందే హమూ అవసరం లేదని పత్రిక ప్రధాన సంపాద కుడు ప్రకాశ్‌ కరత్‌ అభిప్రాయపడ్డారు. అయితే ఉగ్ర వాద మూలాలను కనిపెట్టి వాటిని ఎదుర్కొనే విధా నాలు, పద్ధతులను అనుసరించటంలోనే అసలు సమస్య వస్తున్నదన్నారు.

రియల్‌ఎనర్జీకు దోచిపెడితే ఊరుకోం..

ఒప్పంద కాలపరిమితి ముగిసిన తర్వాత కూడా రియల్‌ ఎనర్జీ సంస్థకు నగర పాలక సంస్థ డబ్బులు చెల్లించడం విడ్డూరంగా ఉందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్‌ 30తో గడువు ముగిసినా కౌన్సిల్‌ తీర్మానం లేకుండానే ఏకపక్షంగా ఒప్పంద కాలపరిమితిని పొడిగించారని విమర్శించారు. అధికార టిడిపి ప్రజాప్రతినిధులు, నేతల ఒత్తిడితో అడ్డగోలుగా కోట్లాది రూపాయలు చెల్లించేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.

Pages

Subscribe to RSS - 2015