'బాక్సైట్‌' ఒప్పందాలు రద్దయ్యేవరకూ పోరాటం- 30న చింతపల్లి గిరిజన గర్జన సభకు బృందాకరత్‌ రాక- సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుల నర్సింగరావు

బాక్సైట్‌ తవ్వకాలకు ఆంధ్రప్రదేశ్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎపిఎండిసి)కి అనుమతులు మంజూరు చేస్తూ జారీ చేసిన జిఒ 97, బాక్సైట్‌ ఒప్పందా లను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసే వరకూ పోరాటం కొనసాగుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ నర్సింగరావు తెలిపారు. ఏజెన్సీలో గ్రామ సభలు నిర్వహించడం, అటవీ హక్కులచట్టం కింద సాగుదారులకు హక్కుపత్రాలు మంజూరు చేయడం వంటి డిమాండ్ల సాధనకు క్షేత్రస్థాయిలో పోరాటం ఉధృతం చేస్తామ న్నారు. ఎన్‌పిఆర్‌ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా డుతూ అధికారంలో ఉన్నప్పుడు బాక్సైట్‌కు అనుకూలంగా వ్యవహరించి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యతిరేకించి గిరిజను లను మోసగించడం కాంగ్రెస్‌, బిజెపి, టిడిపికి అలవాటుగా మారిందని విమర్శించారు. బాక్సైట్‌ వ్యతిరేక పోరాటం వల్ల 97 జిఒను నిలుపుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిం దన్నారు. గాలి జనార్ధన్‌రెడ్డికి లాభాల చేకూర్చి పెట్టినట్లే బాక్సైట్‌ను అన్‌రాక్‌కు అప్పగించి కోట్ల రూపాయలు ఆర్జించేలా ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. ఒడిషాలో ప్రభుత్వరంగ సంస్థ నాల్కో ఆధ్వర్యంలోని బాక్సైట్‌ తవ్వకాలను ఇక్కడ 
లక్షలాది మంది గిరిజనుల జీవితాలను బలిచేసే బాక్సైట్‌ తవ్వకాలకు ముడిపెట్టి ప్రభుత్వం మాట్లాడ్డం సహేతుకం కాదు. సొంత ప్రయోజనాల కోసం అన్‌రాక్‌ కంపెనీకి బాక్సైట్‌ను కట్టబెట్టాలని ప్రభుత్వం చూస్తుందన్నారు. కలా కమిటీ నివేదిక ప్రకారం గ్రామసభలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. గిరిజనుల మనోభావాల పేరుతో బాక్సైట్‌ తవ్వకాలు జరపడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తే ప్రతిఘటించడానికి గిరిజనులు సిద్ధంగావున్నారని చెప్పారు. తనకు, సంబంధిత మంత్రికి తెలీకుండా జిఒ 97 జారీ అయిందని అధికారులపైకి నెట్టి తప్పించుకోవాలని సిఎం చూస్తున్నారు. అన్‌రాక్‌ యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి కేంద్రంపై ఒత్తిడితెచ్చి రెండోదశ అనుమతులు లభించేలా చేశారని తెలిపారు. 
సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం మాట్లాడుతూ బాక్సైట్‌ ఒప్పందాలను రద్దు చేయాలని చేస్తున్న పోరాటంలో భాగంగా సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్‌ ఈనెల 30న చింతపల్లిలో నిర్వహించనున్న 'గిరిజన గర్జన సభ'కు రానున్నారని తెలిపారు. ఈనెల 30 వరకు తమ పార్టీ నేతృత్వంలో గ్రామసభలు నిర్వహించి బృందాకరత్‌, గవర్నర్‌, రాష్ట్రపతికి నివేదిస్తామన్నారు. బాక్సైట్‌ ఒప్పందాలు రద్దు చేయాలని చేసిన కాగ్‌ సూచనను, రాజశేఖర్‌రెడ్డి కాలంలో చీకటి ఒప్పందాలు జరిగాయని ప్రచారం చేసిన చంద్రబాబు ఆ ఒప్పందాలను ఎందుకు కొనసాగిస్తూ జిఒ జారీచేశారో సమాధానం చెప్పాలని సిపియం పార్టీ డిమాండ్ చేస్తుంది.