2015

కృష్టాజిల్లా మ‌చిలీప‌ట్నంలో భూ పోరాట నాయ‌కుల్ని పోలీసులు అరెస్టు చేయ‌టాన్ని ఖండిస్తూ ధిష్టిబొమ్మ ద‌హ‌నం

అక్రమ అరెస్టులపై ఆగ్రహం

బందరు పోర్టుకు అనుబంధంగా పరిశ్రమల పేరుతో ఇచ్చిన భూ నోటిఫికేషన్‌పై ఆందోళన చేస్తున్న భూ పోరాట కమిటీ కన్వీనర్‌ కొడాలి శర్మసహా పలువురిని శనివారం అరెస్టు చేయడంపై ఆదివారం విజయవాడ, మచిలీపట్నాల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. అక్రమ అరెస్టులకు బెదిరేది లేదని, ప్రజలకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్‌.రఘు స్పష్టం చేశారు. అక్రమ అరెస్టులకు నిరసనగా ఆదివారం సిపిఎం, సిపిఐ, వైసిపి ఆధ్వర్యంలో కోనేరుసెంటర్‌ నుండి నవకళ సెంటర్‌ వరకూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా రఘు మాట్లాడుతూ..

కరువు కోతలు..

అమరావతి, పుష్కరాలు, సింగపూర్‌, జపాన్‌ ప్రచారార్భాటంలో పడి చంద్రబాబు ప్రభుత్వం కరువును విస్మరించడం ఘోర అపరాధం కాగా ఆలస్యంగా ప్రకటించిన కరువు మండలాల్లోనూ పిసినారి తనానికి పాల్పడటం మరీ దుర్మార్గం. ఖరీఫ్‌లో రాష్ట్ర వ్యాప్తంగా దుర్భిక్షం అలముకోగా ఆర్చుకొని తీర్చుకొని సీజను ముగిసిన నెల రోజులకు వెల్లడించిన కరువు మండలాల విషయం కూడా ఎంతో లోపభూయిష్టంగా, ఆశాస్త్రీయంగా ఉంది. పదమూడు జిల్లాల్లో 670 మండలాలుండగా మీనమేషాలు లెక్కించి గుర్తించినవి ఏడు జిల్లాల్లో 196 మండలాలు.

మత నియంతృత్వం దిశగా దేశం

రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు (ఆర్‌యస్‌యస్‌) హిందూత్వ ప్రచారానికి కేంద్రంగా ఉంది. భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రభుత్వంపై ఆ ప్రభావం తీవ్రంగా ఉన్నది. ఈ స్థితిలో మనం ఈ కింది విధంగా ప్రశ్నించుకోవచ్చు. ''మనదేశం హేతుబద్ధత, తార్కికతతో పాటు ప్రజాస్వామ్యం నుంచి కూడా దూరంగా వెళ్తూ, హిందూ మత నియంతృత్వం వైపు ప్రయాణిస్తున్నదా?'' దురదృష్టవశాత్తూ ఈ ప్రశ్నకు అవుననే సమాధానం చెప్పుకోవాల్సి వస్తున్నది. ప్రజాస్వామ్యం, తర్కబద్ధత, హేతు వులపై ఆధారపడిన సమాజంలో భిన్నాభి ప్రాయాలను వ్యక్తం చేయటానికి అవకాశాలు ఉండాలి. హేతుబద్ధమైన భిన్నాభిప్రాయాలను ప్రోత్సహించాలి.

అంగట్లో అమ్మకం..

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ)పై నిబంధనలను మరింతగా సడలించిన కేంద్రంలోని ఎన్‌డిఎ సర్కారు దేశాన్ని అంగట్లో నిలబెట్టి అమ్మేందుకు బరితెగించింది. దీపావళి పండుగ వేళ ఎఫ్‌డిఐలపై పరిమితులు సరళీకరించి విదేశీ కార్పొరేట్లకు వెలుగులు అందించిన మోడీ ప్రభుత్వం ఇప్పటికే 'సంస్కరణ'ల భారాలతో మసకబారిన మన ప్రజల బతుకుల్లో చీకట్లు నింపింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదిహేను కీలక రంగాల్లో ఎఫ్‌డిఐలకు తలుపులు బార్లా తెరిచి విదేశీ సంస్థల దోపిడీకి లైసెన్స్‌లు ఇవ్వడం ఆందోళనకరం.

భారత్‌లో హిందూ తాలిబాన్‌ పాలన..

 లండన్‌ నుంచి వెలువడే 'ద గార్డియన్‌' దినపత్రికలో గురువారం ప్రఖ్యాత శిల్పి అనీశ్‌ కపూర్‌ రాసిన వ్యాసం చర్చనీయాంశమైంది. భారత్‌లో కొనసాగుతున్నది 'హిందూ తాలిబాన్‌' పాలన అని ఆయన అభివర్ణించారు. దేశంలో సామాజిక, మతపరమైన మైనారిటీలు ప్రమాదకర పరిస్థితుల్లో జీవిన్నారు. మోడీ ప్రభుత్వ ప్రోద్బలంతోనే కాషాయ దళ కార్యకర్తలు బీఫ్‌ తింటున్నారనే అనుమానాలతో, కుల కట్టుబాట్లను ధిక్కరించారనే కారణంతో హింసాత్మక దాడులకు పాల్పడుతున్నారు. దేశంలో తీవ్ర స్థాయిలో మానవ హక్కుల హననం జరుగుతోంది. దేశీయంగా విమర్శలను సహించలేని మోడీ బ్రిటన్‌కు నచ్చే ఆర్థిక ఎజెండాను అమలు చేస్తున్నారు.

రాజధానికి15వేలకోట్ల విదేశీరుణం

ఇప్పటికే బ్రిటనతో సహా పలు బ్యాంకులు ఆర్థిక సహకారం అందిస్తామంటూ సీఎం చంద్రబాబును కలిసి హామీలు ఇస్తున్నందున రుణాల మంజూరుకు పెద్దగా అవరోధాలు ఎదురయ్యే అవకాశం లేదని సమావేశం అభిప్రాయపడింది. రాజధాని నగర నిర్మాణం కోసం ప్రాథమికంగా రూ.15,000 కోట్ల విదేశీ రుణం అవసరమవుతుందని కమిటీ అంచనా వేసింది. ప్రపంచ బ్యాంకు, జేబీఎ్‌ససీ, జైకా, బీఎ్‌సఐసీ వంటి విదేశీ బ్యాంకుల నుంచి రుణాన్ని తీసుకోవాలని, ఇందుకు అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఆర్‌డీఏ కార్యదర్శి అజయ్‌జైన, కమిషనర్‌ శ్రీకాంతకు పీవీ రమేశ్‌ సూచించారు

భారత్‌లోనూ హై అలర్ట్‌..

పారిస్‌ నరమేధం నేపథ్యంలో భారత్‌లో హై అలర్ట్‌ ప్రకటించారు. ప్రధాన నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎక్కడికక్కడ వాహనాలను సోదాలు నిర్వహిస్తున్నారు. అటు అగ్రరాజ్యం అమెరికా సైతం పారిస్ ఘటనతో అప్రమత్తమైంది. ముఖ్యప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, ప్రధాన సెంటర్లలో పట్టిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. పారిస్ నగరంలో పలు చోట్ల కాల్పులు, పేలుళ్లు జరిగిన ఘటనలో 170 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రపంచ దేశాల అధినేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Pages

Subscribe to RSS - 2015