2015

దేశాన్నేఅమ్మకానికిపెట్టినNDA..

కీలకమైన రంగాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు (ఎఫ్‌డిఐ)లను అనుమతించటం ద్వారా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం దేశాన్నిఅమ్మకానికి పెట్టిందని సిపిఎం పొలిట్‌బ్యూరో విమర్శించింది. సింగిల్‌ బ్రాండ్‌ రిటైల్‌, బ్యాంకింగ్‌, నిర్మాణం, మీడియా, విమానయానం, రక్షణ తదితర 15 కీలక రంగాలలో ఎఫ్‌డిఐలను అనుమతించటాన్ని సిపిఎం పొలిట్‌బ్యూరో గురువారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించింది..

 

అమిత్‌షా పీఠానికి ఎసరు..

బీహార్‌లో బిజెపికి వ్యతిరేకంగా వచ్చిన ఫలి తాలు ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా పీఠానికే ఉచ్చు బిగిస్తున్నాయి. జనవరితో షా ప్రస్తుత పదవీకాలం ముగిసి పోతోంది. ఆ సమయానికి మంత్రివర్గంలో చోటు కల్పించ డం ద్వారా షాను తన చెంత నుంచి దూరం కాకుండా చూసుకోవాలని మోడీ ఆలోచిస్తున్నారన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి.. బీహార్‌ ఎన్నికల ఫలితాలు వెల్లడై నప్పటి నుంచి షా వ్యవహార శైలిపై విమర్శలు వినిపిస్తున్నాయి.

హోదాపైమాట్లాడేస్థాయిలేదు:పవన్

ప్రత్యేక హోదా గురించి కేంద్రంతో మాట్లాడేంత స్థాయి తనకు లేదని, అక్కడున్న ఎంపిలు, రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు ఆ పని చేయాల్సి ఉంటుందని జనసేన అధినేత వపన్‌ కళ్యాణ్‌ అన్నారు. 2019 నాటికి పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వస్తానని తెలిపారు. విజయవాడ క్యాంప్‌ కార్యాలయంలో గురువారం ఉదయం ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. 

గిరీష్ కర్నాడ్‌ను చంపేస్తారట..

ప్రముఖ నటుడు గిరీష్ కర్నాడ్‌ను చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. టిప్పు సుల్తాన్ జయంతి సందర్భంగా  బెంగలూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలని గిరీష్‌ ఓ సభలో డిమాండ్‌ చేశారు. దీంతో కర్నాటక రచయిత కల్బుర్గి, మహారాష్ట్రలో పన్సారేకు పట్టిన గతే పడుతుందని ట్విట్టర్‌లో గిరీష్‌ కర్నాడ్‌ను కొందరు హెచ్చరించారు.

నిత్య అవసర ధరలు తగించాలని వినుతన రీతిలో నిరసన

 నిత్య అవసర ధరలు తగించాలని 9-11-2015న  తిరుపతి ఆర్ డి ఓ  కార్యాలయం ముందు వామపక్షాల అద్వర్యం లో విస్తరిలో మటి, గ్లాసులో నీలతో  వినుతన రీతిలో  ప్రభుత్వానికి నిరసన తెలియజేసారు. ఈ కార్యక్రమలో సి పి యం జిల్లా కార్యదర్శి కె . కుమార్ రెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ స్భుయలు వి . నాగరాజు గారు, నగర కార్యదర్శి టి. సుబ్రమణ్యం, సి ఐ టియు నగర కార్యదర్శి  చంద్ర శేకర్ రెడ్డి , సి పి ఐ  జిల్లా కార్యదర్శి డి .రామనయాడు, నగర కార్యదర్శి  పెంచిలయ మరియు పార్టీ నాయకులూ, కార్యకర్తలు పాల్గొనారు.    

నిత్య అవసర ధరలు తగించాలని వినుతన రీతిలో నిరసన

 నిత్య అవసర ధరలు తగించాలని 9-11-2015న  తిరుపతి ఆర్ డి ఓ  కార్యాలయం ముందు వామపక్షాల అద్వర్యం లో విస్తరిలో మటి, గ్లాసులో నీలతో  వినుతన రీతిలో  ప్రభుత్వానికి నిరసన తెలియజేసారు. ఈ కార్యక్రమలో సి పి యం జిల్లా కార్యదర్శి కె . కుమార్ రెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ స్భుయలు వి . నాగరాజు గారు, నగర కార్యదర్శి టి. సుబ్రమణ్యం, సి ఐ టియు నగర కార్యదర్శి  చంద్ర శేకర్ రెడ్డి , సి పి ఐ  జిల్లా కార్యదర్శి డి .రామనయాడు, నగర కార్యదర్శి  పెంచిలయ మరియు పార్టీ నాయకులూ, కార్యకర్తలు పాల్గొనారు.    

FDIలకు వ్యతిరేకంగా ఆందోళన..

దేశ ఆర్ధిక వ్యవస్ధకు ఎఫ్‌డీఐలు చిచ్చు పెడతాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు విమర్శించారు. విజయవాడలో సీపీఎం నేతలు, కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేశారు. మోదీ ప్రభుత్వం వంద శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతివ్వడం పట్ల వారు ఆందోళన వ్యక్తం చేశారు. సీపీఎం కార్యాలయం నుంచి బీసెంట్‌ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించి ఎఫ్‌డీఐ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. 

ధరల పెరుగుదల-పిడిఎస్‌ ప్రాధాన్యత

నిత్యావసర సరుకుల ధరలు సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా పెరిగిపోతున్నాయి. గతంలో ఉల్లిపాయల ధరలు పెరిగాయి. ఇప్పుడు కందిపప్పు ధరలు ఆ విధంగానే పెరుగుతున్నాయి. మార్కెట్‌లో కిలో రూ.15 నుంచి రూ.20 లభించే ఉల్లిపాయల ధరలు రూ.80 దాటి పెరిగి, ఇప్పుడు రూ.25-30 వద్ద ఉన్నాయి. రూ.80-90 కందిపప్పు ధర గత నాలుగు మాసాల నుంచి పెరుగుతూ కోడిమాంసం ధరలను దాటి, ఏటమాంసం ధరలను అందుకొనే వైపుగా పరుగులు తీస్తున్నది. ఇతర పప్పుల ధరలు కూడా ఈ విధంగానే పెరుగుతున్నాయి. ఈ సరుకుల ధరలు పెరగటానికి కారణమేమిటి?

బీహార్‌ ఎన్నికలు నేర్పుతున్న పాఠాలు

రాజకీయ విశ్లేషకుల అంచనాలు తలకిందులు చేస్తూ నితీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని మహా కూటమి ఘనవిజయం సాధించింది. ఎన్నికల ఫలితాలు బిజెపికి ప్రత్యేకించి మోడీ, అమిత్‌ షాల నాయకత్వాలకు పెద్ద ఎదురు దెబ్బ. అన్నిటినీ మించి సంఘ పరివార్‌ దేశంపై రుద్దాలనుకున్న సనాతన, భూస్వామ్య సంస్కృతి, వారి అనాగరిక చర్యలకు ఇది బీహార్‌ ప్రజల సమాధానం. కులం, ఉప కులం పేరుతో ప్రజలను చీల్చాలనుకోవడం, ప్రజల్లోని భక్తి భావాలను రాజకీయంగా సొమ్ము చేసుకోవాలనే దృష్ట యత్నాలకు దీన్ని ప్రతిఘటనగా భావించవచ్చు. స్వాతంత్య్రోద్యమంలో ఎలాంటి పాత్రా లేని ఆరెస్సెస్‌, మహాత్మా గాంధీని హత్య చేసిన ఆరెస్సెస్‌, సంఘ పరివార్‌ ఫాసిస్టు పోకడలకు ఇది అడ్డుకట్ట.

Pages

Subscribe to RSS - 2015