
లండన్ నుంచి వెలువడే 'ద గార్డియన్' దినపత్రికలో గురువారం ప్రఖ్యాత శిల్పి అనీశ్ కపూర్ రాసిన వ్యాసం చర్చనీయాంశమైంది. భారత్‌లో కొనసాగుతున్నది 'హిందూ తాలిబాన్' పాలన అని ఆయన అభివర్ణించారు. దేశంలో సామాజిక, మతపరమైన మైనారిటీలు ప్రమాదకర పరిస్థితుల్లో జీవిన్నారు. మోడీ ప్రభుత్వ ప్రోద్బలంతోనే కాషాయ దళ కార్యకర్తలు బీఫ్ తింటున్నారనే అనుమానాలతో, కుల కట్టుబాట్లను ధిక్కరించారనే కారణంతో హింసాత్మక దాడులకు పాల్పడుతున్నారు. దేశంలో తీవ్ర స్థాయిలో మానవ హక్కుల హననం జరుగుతోంది. దేశీయంగా విమర్శలను సహించలేని మోడీ బ్రిటన్‌కు నచ్చే ఆర్థిక ఎజెండాను అమలు చేస్తున్నారు.