2015

పీసా చట్టం నిర్వీర్యo:MLCశర్మ

విశాఖ: బాక్సైట్‌ తవ్వకాలను ఐక్యంగా అడ్డుకోవాలని ఎమ్మెల్సీ ఎంవిఎస్‌ శర్మ పేర్కొన్నారు. గిరిజన భవన్‌ బాక్సైట్‌ వ్యతిరేక ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యాన సోమవారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శర్మ మాట్లాడుతూ, గిరిజన చట్టాల ప్రకారం గిరిజన ప్రాంతంలో ప్రభుత్వం కూడా గిరిజనేతర సంస్థ మాత్రమేనని, అటువంటి గిరిజనేతర ప్రభుత్వం విశాఖ ఏజెన్సీలో బాక్సైట్‌ తవ్వకాలకు అనుమతినిస్తూ జీవో ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. పీసా చట్టం ప్రకారం గిరిజన ప్రాంతంలో గ్రామ సభ లు చేసిన తీర్మానాలే సుప్రీం అని అన్నారు.

TRSకు 4,59,092ఓట్ల మెజారిటీ..

వరంగల్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పసనూరి దయాకర్‌ ఘన విజయం సాధించాడు. ఆయన 4,59,092ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించాడు. టీఆర్‌ఎస్‌కు 6,15,403 ఓట్లు పోలు కాగా కాంగ్రెస్‌కు 1,56,315 ఓట్లు రాగా, బీజేపీకి 1,30,178 ఓట్లు వచ్చాయి. బీజేపీ, కాంగ్రెస్ రెండో స్థానం కోసం పోటీ పడ్డాయి తప్ప.. కనీస పోటీని కూడా ఇవ్వలేదు. 

చైనా విజన్‌ భారత్‌కు స్ఫూర్తి..

చైనా ఆర్థిక విజన్‌ భారత్‌కు స్ఫూర్తి అని ప్రధాని నరంద్రమోడీ పేర్కొన్నారు. 37వ సింగపూర్‌ లెక్చర్‌లో ఆయన ప్రసంగించారు. ఇండియా-చైనా ప్రపంచంలోనే ఆర్థికంగా అతివేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలని మోడీ అభివర్ణించారు.

అబ్దుల్‌ కలామ్‌ను విస్మరించిన BJP

మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలామ్‌ మనవడు ఎపిజె సయ్యద్‌ హజా ఇబ్రహీం బిజెపి నుంచి వైదొలిగారు. 2012లో పార్టీలో చేరిన ఆయన తమిళనాడు మైనారిటీ విభాగ ఉపాధ్యక్ష పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ సోమవా రం రాజీనామా చేశారు. ఢిల్లీలోని కలామ్‌ నివాస గృహాన్ని(రాజాజి మార్గ్‌ బంగ్లా) నాలెడ్జ్‌ కేంద్రంగా మారుస్తామని ఇచ్చిన మాటను కేంద్ర ప్రభుత్వం విస్మరించినందుకు నిరసనగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.. ఎన్ని సార్లు ఈ విష యాన్ని గుర్తు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేద న్నారు. 

సోలార్‌ పార్కు నిర్వాసితులకు న్యాయం చేయాలి..

సోలార్‌ పార్కు నిర్వాసితులకు న్యాయం చేయాలని అడిగేందుకు వెళ్లిన సిపిఎం, ప్రజాసంఘాల నాయకులను, నిర్వాసిత రైతులను ప్రభుత్వం నిర్బంధించింది. అరెస్టు చేసి 22 మందిని జైలుకు పంపింది. అనంతపురం జిల్లా ఎన్‌పికుంట మండలంలో ఏర్పాటు చేస్తున్న సోలార్‌ పార్కు కోసం రాష్ట్ర ప్రభుత్వం 7,500 ఎకరాల భూమిని సేకరించింది. నిర్వాసితులకు పరిహారం చెల్లించ కుండానే భూములను కంపెనీకి కట్టబెట్టింది. నిర్వాసిత రైతులు సోమవారం ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనకు సిపిఎం మద్దతిచ్చింది. సోలార్‌ భూముల్లోకి చొచ్చుకెళ్లి పనులు జరుగుతున్న ప్రాంతంలో ఎర్రజెండాలను పాతారు. నిర్వాసితులకు న్యాయం చేయకపోతే పనులు సాగనీయబోమని హెచ్చరించారు.

30న గిరిజన గర్జన సభ:CPM

 

 

బాక్సైట్‌ ఒప్పందాలను రద్దు చేయాలని చేస్తున్న పోరాటంలో భాగంగా ఈ నెల 30న చింతపల్లిలో 'గిరిజన గర్జన సభ' నిర్వహించనున్నట్లు సిపిఎం ప్రకటించింది. సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్‌ ఈ సభలో పాల్గొననున్నారని పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ నర్సింగరావు తెలిపారు. డిమాండ్ల సాధనకు క్షేత్రస్థాయిలో పోరాటం ఉధృతం చేస్తామన్నారు. 

నేడే వరంగల్‌ పార్లమెంట్‌ పోరు..

వరంగల్‌ పార్లమెంట్‌ ఉప ఎన్నికల పోలింగ్‌ నేడు  ఉదయం ఏడు గంటలకే ప్రారంభం కానుంది. ఈ ఎన్నికల సందర్భంగా 791 సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. ఖమ్మం జిల్లా చర్ల ఘటనతో ఆ ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత సిద్ధం చేశారు. 1778 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందుకోసం 8వేల 160 మంది సిబ్బందిని నియమించారు. పోలింగ్‌ ప్రశాంతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేసినట్టు కలెక్టర్‌ వాకాటి కరుణ తెలిపారు. 

30న గిరిజన గర్జన సభ:CPM

బాక్సైట్‌ ఒప్పందాలను రద్దు చేయాలని చేస్తున్న పోరాటంలో భాగంగా ఈ నెల 30న చింతపల్లిలో 'గిరిజన గర్జన సభ' నిర్వహించనున్నట్లు సిపిఎం ప్రకటించింది. సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్‌ ఈ సభలో పాల్గొననున్నారని పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ నర్సింగరావు తెలిపారు. డిమాండ్ల సాధనకు క్షేత్రస్థాయిలో పోరాటం ఉధృతం చేస్తామన్నారు. 

రూ.1.25 లక్షల కోట్లకే బడ్జెట్‌..

రాష్ట్ర వార్షిక బడ్జెట్‌కు భారీగా ప్రతిపాదనలు వస్తున్నాయి. సాధారణ అవసరాలు సహా, సౌకర్యాలపై కూడా దిగువ స్థాయి కార్యాలయాల నురచి డిమాండ్స్ వస్తున్నాయి. దీరతో ఆర్థిక శాఖ తలపట్టుకుంటోంది. ఈసారి బడ్జెట్‌కు పంచాయతీ స్థాయి నురచీ అవసరాల చిట్టాను తెప్పిరచుకోవాలని నిర్ణయిరచిన నేపథ్యంలో దాదాపు 30 వేల మంది డిడిఓ (డ్రాయిరగ్‌, డిస్‌బర్స్‌మెరట్‌ ఆఫీసర్‌)ల నురచి అవసరాల వివరాలు తెప్పిస్తున్నారు. దాదాపు పది నురచి 15 లక్షల కోట్ల రూపాయల అరచనాలు సిద్ధమవుతాయని ఆర్థిక శాఖ అరచనా వేస్తోంది. చివరకు మాత్రం రూ.1.25 లక్షల కోట్లకే బడ్జెట్‌ ఖరారు చేసే అవకాశాలున్నాయి. 

Pages

Subscribe to RSS - 2015