
వరంగల్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థి పసనూరి దయాకర్ ఘన విజయం సాధించాడు. ఆయన 4,59,092ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించాడు. టీఆర్‌ఎస్‌కు 6,15,403 ఓట్లు పోలు కాగా కాంగ్రెస్‌కు 1,56,315 ఓట్లు రాగా, బీజేపీకి 1,30,178 ఓట్లు వచ్చాయి. బీజేపీ, కాంగ్రెస్ రెండో స్థానం కోసం పోటీ పడ్డాయి తప్ప.. కనీస పోటీని కూడా ఇవ్వలేదు.