దళితసమస్యలపైచర్చించాలి:CPM

అంబేద్కర్‌ పేరుతో ప్రభుత్వ మతోన్మాద ఎజెండాను ముందుకు తీసుకెళ్లేందుకు పూనుకుందని, అది మరోమారు ప్రత్యేకంగా, పార్లమెంట్‌ సాక్షిగా రుజువైందని సిపిఎం ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ పక్ష నేత సీతారాం ఏచూరి విమర్శించారు. మొదట్నుంచి సిపిఎం ఉహించినట్లే ప్రభుత్వ వైఖరి ఉందని వ్యాఖ్యానించారు. దళితులు, గిరిజనలు, వెనుబడిన వారి అభివృద్ధిపై ప్రభుత్వం, బిజెపి దృష్టి పెట్టడం లేదని, ఎంతసేపు వారి హిందూత్వ సిద్ధాంతాన్ని బలోపేతం చేసి, మతోన్మాద ఘర్షణలు పెంచాలనే దానిపై దృష్టి కేంద్రీకరించి పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎస్సీ,ఎస్టీ, ఓబిసిల అభివృద్ధిని సిపిఎం కోరుకుందని ఆ దిశగా చట్టాలు తీసుకురావాలని డిమాండు చేశారు.