వామపక్షాల ఆధ్వర్యంలోడిసెంబర్‌ 1 నుండి 6 వరకు మతోన్మాద వ్యతిరేక ప్రచారం

వామపక్షాల దేశ వ్యాప్త పిలుపులో భాగంగా డిసెంబర్‌ 1 నుండి 6వ తేదీ వరకు మతోన్మాదంపై వ్యతిరేక దినాలుగా పాటించాలని వామపక్ష పార్టీల నాయకులు వెల్లడించారు. డిసెంబర్‌ 3న స్థానిక అంబేద్కర్‌సెంటర్‌లో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఆదివారం కొత్తపేట మల్లయ్యలింగం భవనంలో తూమాటి శివయ్య అధ్యక్షతన పలు వామపక్ష పార్టీల నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నరేంద్రమోడీ నాయకత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం హిందూత్వ సిద్ధాంతంపై మరింత మొగ్గు చూపుతుందని, దీనికి ప్రతిఘటన క్రమం ప్రారంభం కావటం సానుకూల పరిణామమన్నారు. రచయితలు, మేధావులు, కళాకారులు, ఇందులో గొప్ప పాత్ర పోషించటం అభినందనీయమన్నారు. బిజెపి అధికారం చేపట్టిన నాటి నుండి ప్రభుత్వ వ్యవహారాల్లో ఆర్‌ఎస్‌స్‌ జోక్యం చేసుకోవటం ప్రారంభమై, ఇప్పుడు మరింత దూకుడుగా వ్యవహరిస్తుందన్నారు. మోడీ ప్రభుత్వం రాజ్యాంగం, ప్రజాతంత్ర మౌలిక విధానాలను పూర్తిగా నిరాకరిస్తూ ప్రమాదకర మార్గాన్ని నాయకులు పేర్కొన్నారు. సంఫ్‌ుపరివార్‌ మైనార్టీలు, మేధావులు, హేతువాదులు, రచయి తలు, శాస్త్రవేత్తలపై చేస్తున్న దాడుదలు, విద్వేష ప్రచారం, అసహనం వ్యాప్తికి ఆజ్యం పోస్తున్నాయన్నారు. జిల్లా వ్యాప్తంగా నియోజక వర్గాలు, మండల కేంద్రాల్లో వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో సిపిఎం, సిపిఐ జిల్లా, నగర కార్యదర్శులు పాశం రామారావు, జంగాల అజరుకుమార్‌, ఎన్‌.భావన్నారాయణ, మాల్యాద్రి, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.రాధాకృష్ణ న్యూడెమోక్రసీ నాయకులు వి.నరసింహారావు, కె.శ్రీధర్‌ పాల్గొన్నారు.