ఆనం బ్రదర్స్ TDPలోకి..

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఆయన సోదరుడు, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఈ విషయమై ఇప్పటికే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావుతో చర్చించామని, ఒకటి రెండు రోజుల్లో సీఎం చంద్రబాబుతో కూడా చర్చించి పార్టీలో చేరిక తేదీని ఖరారు చేస్తామన్నారు. తొలుత ఆనం సోదరులు గురువారం నెల్లూరులోని తమ నివాసంలో కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించి, అభిప్రాయ సేకరణ జరిపారు.