బ్రిటన్లో మోడీపై వ్యతిరేకత..

ప్రస్తుతం బ్రిటన్‌లో పర్యటిస్తున్న భారత ప్రధాని నరేంద్రమోడీకి ఎర్రతివాచీ పరచి స్వాగతం చెప్పటం సరికాదని, ఆ దేశంలో కొనసాగుతున్న మానవహక్కుల హననానికి నిరసనగా ఎర్రజెండాలు ఎగురవేసి నిరసన తెలపాలని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ సంస్థ బ్రిటన్‌ ప్రధాని డేవిడ్‌ కెమరాన్‌ను కోరింది. ఆమ్నెస్టీ బ్రిటన్‌ విధాన నిర్ణయ విభాగం అధిపతి అల్‌ హోగార్త్‌ శుక్రవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ భారత్‌లో స్వచ్ఛంద సంస్థలు, కార్యకర్తలు తమ కార్యకలాపాలను కొనసాగించేందుకు అనేక అడ్డంకులను ఎదుర్కొంటున్నారని, కొంతమందిపై బురద జల్లు తూ మరికొంతమందిపై నల్ల ఇంకు పూస్తూ వారిని జాతి వ్యతిరేకులుగా ఆరోపిస్తున్నారని చెప్పారు. మరో దేశాధి నేత ఎవరైనా బ్రిటన్‌ ఎర్రతివాచీ స్వాగతం కన్నా ఎక్కువగానే చేయాల్సివుంటుందని, అయితే మోడీ విషయంలో మాత్రం మానవ హక్కుల అణచివేతకు వ్యతిరేకంగా ఎర్రజెండాలతో నిరసన తెలియచేయాలని ఆయన అన్నారు.