భూ సేకరణపై ఐక్య పోరాటం - సిపియం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం

భూ సేకరణకు వ్యతిరేకంగా రైతులు ఐక్య పోరాటం చేయడంతోనే ప్రభుత్వం వెనక్కి తగ్గిందని సిపిఎం జిల్లా కార్యదర్శి కార్యదర్శి కె.లోకనాధం పేర్కొన్నారు. ఇండిస్టీయల్‌ పార్కు (పిసిపిఐఆర్‌) పేరుట ప్రభుత్వం చేపడుతున్న భూసేకరణకు వ్యతిరేకంగా ఇండిస్టీయల్‌ పార్కు వ్యతిరేఖ పోరాట కమిటి అధ్యక్షులు లొడగల చంద్రరావు ఆధ్వర్యంలో మూలపర్ర గ్రామంలో రైతులతో శుక్రవారం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు హాజరైన లోకనాథం మాట్లాడుతూ, భూసేకరణకు వ్యతిరేఖంగా ఈ ప్రాంత రైతులు అలుపెరగని పోరాటం చేస్తున్నారన్నారు. ఈ ప్రాంత రైతు లంతా ఐక్యంగా భూసేకరణకు వ్యతిరేఖంగా కోర్టును ఆశ్రయించడం తోనే ప్రభుత్వం భూసేకరణకు నోటిఫికేషన్‌ ఇచ్చి 5 సంవత్సరాలైనా వెనక్కి తగ్గిందన్నారు. ప్రభుత్వం రైతులను మోసగించి కారుచౌకుగా బలవంతంగా భూములు లాక్కొంటుందన్నారు. అచ్యుతాపురం ఎస్‌ఇ జెడ్‌లో 10 వేల ఎకరాలను ఎకరానికి రూ.3లక్షల చొప్పున రైతులకు ఇచ్చి ప్రభుత్వం తీసుకుందన్నారు. ఆ భూమిని ఎకరం కోటి రూపాయ లకు ఎన్‌టిపిసికి అప్పగించిందన్నారు. పరిశ్రమలు ఇచ్చే ధరను రైతులకు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. రాజకీయాలకు అతీతంగా ఇక్కడ రైతులు పోరాటం చేయడంతో ఎకరానికి రూ.24లక్షలు ఇప్పించ కలిగినట్లు చెప్పారు. భూసేకరణకు వ్యతిరేఖంగా ఈ ప్రాంత రైతులు ఐక్యంగా ఉండి పోరాటం చేయాలన్నారు. భూసేకరణపై ఉద్యమిస్తే అండగా ఉంటామని రైతులకు భరోసా ఇచ్చారు. అనంతరం అడ్వకేట్‌ ప్రసాద్‌, తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ సూరకాసుల రామలకిë, ఎంపిటిసి సభ్యులు కోశెట్టి కనక, గంటా తిరుపతిరావు, మండల పరిషత్‌ చీఫ్‌ అడ్వయిజర్‌ కళ్ళేపల్లి బాబ్జిరాజు, సిపిఎం నక్కపల్లి డివిజన్‌ కన్వీనర్‌ ఎం.అప్పలరాజు, భూసేకరణ వ్యతరేక పోరాట కమిటి సభ్యు లు కళ్ళేపల్లి అప్పలరాజు, అయినంపూడి మణిరాజు, అవతారం రాజు, తళ్ళ అప్పలస్వామి, పిక్కి సత్యారావు, పుణ్యమంతుల రమణ, పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు.