
ఢిల్లీలో 4 నాలుగు రోజుల పాటు సుదీర్ఘం సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు ముగిశాయి. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, దేశంలో నెలకొన్న సమస్యలపై కేంద్ర కమిటీ సమావేశాలు జరిగాయి. ప్రజా వ్యతిరేక విధానాల పై పోరాటం ఎలా చేయాలి, ఎల్డీ ఎఫ్ ను బలోపేతం చేసేందుకు కావల్సిన మార్గదర్శకాలను చర్చించడం జరిగిందని పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు తెలిపారు. ఈ అంశాలను ప్రతి రాష్ట్ర కమిటి చర్చించిన తరువాత కోల్ కతాలో జరిగే ప్లీనరీ సమావేశాల్లో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.