
కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ మంగళవారం మరో వివాదానికి తెరతీశారు. ప్రధాని మోదీని గద్దె దింపితేనే భారత, పాకిస్థాన్‌ల మధ్య చర్చలు ప్రారంభమవుతాయంటూ పాకిస్థాన్‌కు చెందిన దునియా టీవీ చానెల్ చర్చా కార్యక్రమంలోనే వ్యాఖ్యానించి మరో దుమారం రేపారు. భారత, పాక్‌ల చర్చలు తిరిగి ప్రారంభం కావడానికి ఏం చేయాలంటూ పాక్ టీవీ చానెల్ వ్యాఖ్యాత ప్రశ్నకు అయ్యర్ స్పందిస్తూ.. ‘‘అన్నింటి కంటే ముందుగా మోదీని తొలగించాలి.ఇరుదేశాల సంబంధాలు మెరుగయ్యేందుకు ఇంతకుమించి మార్గం లేదు అని అన్నారు.