
కేరళలో సిపిఐ(ఎం) నేతృత్వంలోని ఎల్‌డిఎఫ్ ఆరు కార్పొరేషన్లకు ఐదు కార్పొరేషన్లను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ కేవలం కోచి కార్పొరేషన్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ ఆరు కార్పొరే షన్ల మేయర్లలో ముగ్గురు మహిళలు. తిరువనంతపురం, కొల్లాం, త్రిస్పూర్, కొజికోడ్, కన్నూర్ కార్పొరేషన్లలో ప్రతిపక్ష వామపక్ష ప్రజాతంత్ర కూటమి (ఎల్‌డిఎఫ్) అధికారంలోకి వచ్చింది.