వారు ముస్లింలైతే మోడీ తీరేవేరు

ఛోటారాజన్‌, ఉల్ఫా నేత అనూప్‌ ఛేతియాపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత షకీల్‌ అహ్మద్‌ ట్విట్ట ర్‌లో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. 'ఛోటారాజన్‌, అనుప్‌ ఛెటి యా ముస్లిం కాకపోవటం వారి అదృ ష్టం, వారు ముస్లింలు అయితే మోడీ సర్కారు వారితో అనుసరించే తీరు వేరుగా వుండేది' అంటూ ట్విట్టర్‌లో ఆయన చేసిన వ్యాఖ్య లపై బిజెపి మండిపడింది. తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావటంతో వాటిపై అహ్మద్‌ వివరణిస్తూ ఉగ్రవాదంపై బిజెపి అనుసరిస్తున్న 'రెండు నాల్కల ధోరణి, ద్వంద్వ ప్రమాణాలను ఎండగట్టేందుకే తానీ వ్యాఖ్యలు చేశానన్నారు.