August

PACS లను ప్రభుత్వం కాపాడాలి.... సిపియం జిల్లా కార్యదర్శి కె.లోకనాధం

ఈ రోజు విశాఖ జిల్లా డి.సి.ఒ ఆఫీస్ వద్ద జరిగిన ధర్నాలో కె. లోకనాధం మాటలాడుతూ పి.ఎ.సి.ఎస్ ఉద్యోగులకు వెంటనే వేతన సవరణ చేయాలన్నారు. డి.సి.సి.బి నియామకాల్లో పి.ఎ.సి.ఎస్ కోట కొనసాగించాలని, రిటైర్ మెంట్ 60 సంవత్సరాలకు పొడిగించాలన్నారు.  పి.ఎ.సి.ఎస్ ఉద్యోగుల పోరాటాలకు సిపియం పార్టీ  ఎప్పుడు తన మద్దతు ఉంటుందని తెలియజేసారు. ప్రభుత్వం వెంటనే పి.ఎ.సి.ఎస్. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేసారు ....

ఉద్యోగుల డిమాండ్లు ...

నిత్యావసర ధరలు తగ్గించాలి:CPM

 ప్రభుత్వం నిత్యవసర ధరలు తగ్గిం చాలని కర్నూలు సిపిఎం జిల్లా కార్యదర్శి కె ప్రభాకర్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.  రాష్ట్రానికి, దేశానికి ఉల్లిని సరఫరా చేసే కర్నూలులోని బహిరంగ మార్కెట్‌లో ధర రూ.50లు పలుకుతుందని, కందిపప్పు కిలో రూ.100లకు దాటిపోయిందని, కూరగాయలు కొనలేని పరిస్థితిల్లో సామాన్యులు ఉన్నారని తెలిపారు.

37ఏళ్ళ తరువాతCPMనిర్మాణ ప్లీనం

 న్యూఢిల్లీ: పార్టీ నిర్మాణ నివేదికపై అఖిలభారత విస్తృతస్థాయీ సమావేశం (ప్లీనం) డిసెంబరులో కొల్‌కతాలో నిర్వహించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) నిర్ణయించింది. కోల్‌కతాలో ఈ తరహా ప్లీనం నిర్వహించడం 37 సంవత్సరాల తరువాత ఇదే మొదటిసారి. పార్టీ నిర్మాణ బలం, బలహీనతలను మదింపు వేసేందుకు జరిగే ఈ ప్లీనం ఏర్పాట్లపై ఆదివారం నాడిక్కడ ముగిసిన మూడు రోజుల కేంద్ర కమిటీ సమావేశాలలో విస్తృతంగా చర్చించారు.

భూసేకరణకు వ్యతిరేకంగా ఆందోళన..

రాజధాని భూసేకరణ నోటిపికేషన్‌ను వ్యతిరేకిస్తూ వివిధ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన రాస్తారోకోపై పోలీసులు దాష్టీకం ప్రదర్శించారు. ప్రకాశం బ్యారేజ్‌ వద్ద ఆందోళన చేస్తున్న రైతు, ప్రజా, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకుల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. బలవంతంగా అరెస్ట్‌లు చేశారు. అరెస్టు అయినవారిలో సిపిఎం క్రిడా ప్రాంత కన్వీనర్‌ సిహెచ్‌ బాబూరావు, జె శివశంకర్‌, రవి, నవీన్‌, రైతు సంఘం నాయకులు గంగాధరం తదితరులున్నారు. వీరిపై 341, 143 సెక్షన్లపై కేసు నమోదు చేశారు. రాస్తారోకో ప్రారంభం కాకముందే చెల్లాచెదురు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు.

ధరలను నియంత్రించాలి..

ధరల పెరుగుదలను నియంత్రించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలి. ఇందుకు ప్రజాపంపిణీ వ్యవస్థను సార్వత్రీకరించాలి. నిత్యావసర సరుకుల మార్కెట్‌లో స్పెక్యు లేషన్‌ను నివారించాలి. అఖిల భారత వినిమయ ధరల సూచిక 2013-13లో 10.4 శాతం పెరగగా 2013-14లో 8.3 శాతం, 2014-15లో 5.3 శాతం పెరిగింది. ఆహార వస్తువుల ధరలు మరింత పెరుగుతున్నాయి. వీటి ధరలు 2012-13లో 12 శాతం, 2013-14లో 8.3 శాతం, 2014-15లో 6.3 శాతం పెరిగాయి. గత 8 నెలలుగా ధరల పెరుగుదల రేటు పెరుగుతున్నది. నవంబరు 2014లో ద్రవ్యోల్బణం 4.12 శాతం కాగా మే 2015లో 5.74 శాతం అయింది. జూన్‌ 2015లో ద్రవ్యోల్బణం రేటు భారతదేశంలో 5.4 శాతం కాగా చైనాలో 1.4 శాతమే ఉన్నది.

రాజధాని రాజకీయ క్రీడలో చంద్రబాబు..

మిగిలిన విషయాలెలా ఉన్నా ఒక రాష్ట్ర రాజధాని నిర్మాణం దీర్ఘ కాల దృష్టితో జరగాల్సిన చారిత్రిక వ్యవహారం. అందులోనూ నవ్యాంధ్ర ప్రదేశ్‌కు ప్రజా రాజధాని నిర్మిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకటికి రెండుసార్లు ప్రకటించి ఉన్నారు. కానీ ఆచరణలో ఆయన వ్యవహరిస్తున్న తీరు ప్రజలనూ, ప్రజల్లో పనిచేసే పార్టీలనూ ఏ మాత్రం విశ్వాసంలోకి తీసుకోని ఏకపక్ష తతంగంగా నడుస్తున్నది. ఆఖరుకు తన మిత్రపక్షాలనూ, స్వంత పాలకపక్ష ప్రముఖులనూ, ప్రభుత్వ నిర్వహణకు ప్రాణవాయువు లాటి ఉద్యోగ అధికార వర్గాలను కూడా తికమక పెట్టేదిగా మారింది.

ప్రకాశం బ్యారేజీ వద్ద రైతుల రాస్తారోకో..

రాజధాని నిర్మాణం కోసం చేపట్టిన భూసేకరణపై రోజు రోజుకు నిరసనలు పెరుగుతున్నాయి. పలు గ్రామాల్లో రైతులు వివిధ రూపాల్లో తమ నిరసనలు వ్యక్తం చేశారు. తాడేపల్లి మండలం ఉండవల్లిలో రైతులు సమావేశమై ప్రభుత్వ తీరును తీవ్రంగా ఎండగట్టారు. రాజధాని గ్రామాల్లో భూ సమీకరణ, భూసేకరణను వ్యతిరేకిస్తూ నేడు ఉదయం 10 గంటలకు ప్రకాశం బ్యారేజీ మీద రాజధాని గ్రామాల రైతులు, వ్యవసాయ కార్మికులు, చేతివృత్తిదారులతో రాస్తారోకో నిర్వహించారు.  ఈనెల 24న రాజధాని గ్రామాల్లోని క్రిడా కార్యాలయాలను ముట్టడించాలని, 25న రాజధాని ప్రాంత గ్రామాల్లో బంద్‌ పాటించాలని పిలుపునిచ్చారు..

 

Pages

Subscribe to RSS - August