August

హైకోర్టులో షాక్.. సుప్రీమ్ కు కేజ్రీ

అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది.  ఢిల్లీ మంత్రివర్గం ఇచ్చే సలహాల ప్రకారం లెఫ్టినెంట్ గవర్నర్ నడుచుకోవాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని 239వ అధికరణం ఇంకా అమలులోనే ఉందని, దాని ప్రకారం ఢిల్లీ ఇంకా కేంద్రపాలిత ప్రాంతమే అవుతుందని తెలిపింది. ముందుగా లెఫ్టినెంట్ గవర్నర్‌కు చెప్పకుండా మంత్రివర్గం ఎలాంటి నిర్ణయం తీసుకోడానికి వీల్లేదని కూడా కోర్టు చెప్పింది. కేంద్రప్రభుత్వ అధికారులపై ఏసీబీ ఎలాంటి చర్యలు తీసుకోడానికి వీలు లేదని తెలిపింది. అయితే, ఈ తీర్పుతో తీవ్రంగా నిరాశ చెందిన ఢిల్లీ ప్రభుత్వం.. తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపింది.

టిడిపి అంటే తెలుగు డ్రామా పార్టీ..

తెలుగుదేశం పార్టీ(టిడిపి)ని ఒక తెలుగు డ్రామా పార్టీగా కాంగ్రెస్‌ సభ్యులు జైరాం రమేష్‌ అభివర్ణించారు. ప్రత్యేక హోదా సాధనలో ఆ పార్టీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్‌ సభ్యులు కెవిపి రామచంద్రరావు, టి.సుబ్బిరామి రెడ్డి, ఏపిసిసి చీఫ్‌ రఘువీరాతో కలసి బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ రాజ్యసభలో ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండు చేశారు.

మోటారు సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం

దేశంలో రోడ్డు భద్రత, రవాణా రంగంలో భారీ సంస్కరణలకు కేంద్రం తెరలేపింది. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారికి భారీ జరిమానాలు విధిస్తూ రూపొందించిన మోటారు వాహనాల (సవరణ) బిల్లు-2016కు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. డ్రంకెన్ డ్రైవింగ్ కేసుల్లో రూ.10 వేలు, హిట్ అండ్ రన్ కేసుల్లో రూ. 2 లక్షల జరిమానాను ప్రతిపాదించారు. 18 రాష్ట్రాల రవాణా మంత్రుల సిఫార్సుల మేరకు ఈ బిల్లును రూపొందించినట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ చెప్పారు.

‘జీఎస్‌టీ’కి రాజ్యసభ ఆమోదం..

వివిధ రకాల రాష్ట్ర, స్థానిక పన్నులను తొలగించి.. వాటి స్థానంలో దేశవ్యాప్తంగా ఏకైక ఏకీకృత పన్నుగా.. వస్తువులు, సేవల పన్ను (జీఎస్‌టీ)ను ప్రవేశపెట్టాలన్న చరిత్రాత్మక నిర్ణయానికి రాజ్యసభ బుధవారం ఆమోదం తెలిపింది. 

కేంద్రంపై ఐక్యపోరాటాలు తప్పవు..

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలపై ఐక్య పోరాటాలు తప్పవని కార్మిక సంఘాల నేతలు స్పష్టం చేశారు. సెప్టెంబర్‌ 2న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సికింద్రాబాద్‌లోని రైల్వే ఎంప్లాయీస్‌ యూనియన్‌ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పలువురు కార్మిక సంఘాల నేతలు మాట్లాడారు. కార్మిక, ఉద్యోగ సంఘాల పట్ల మోడీ ప్రభుత్వం చులకన భావంతో వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రభుత్వం ముందుంచిన 12 న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో మొండిగా వ్యవహరిస్తోందన్నారు.

కశ్మీరీ ప్రజల గొంతును వినండి మోదీ..

జమ్ముకశ్మీర్‌ పరిస్థితుల గురించి అమెరికాలో నివసించే 17ఏళ్ల బాలిక ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కశ్మీర్‌కు చెందిన ఫాతిమా షహీన్‌ అమెరికాలోని జార్జియాలో ఉంటున్నారులేఖలో దయచేసి కశ్మీరీ ప్రజల గొంతును వినండి.. అని మోదీని అర్థించారు. అక్కడి ప్రజల పట్ల సానుభూతి ఉంటే.. అన్ని రకాల ప్రసార మాధ్యమాలను నిలిపివేయకుండా, పరిస్థితి అదుపు చేయడానికి మరో మార్గం ఎంచుకోవాలని కోరారు. వారి స్వేచ్ఛకు భంగం కలిగించొద్దని లేఖలో కోరారు.. 

టిడిపి,బిజెపికి చిత్తశుద్ధిలేదు:కృష్ణయ్య

టిడిపి, బిజెపి నాయకత్వానికి చిత్తశుద్ధి లేదని, ప్రత్యేక హోదా ఆందోళనలో టిడిపి నేతలను చంద్రబాబు పాల్గొనకుండా చేయడం దారుణమని సీపీఎం నేత కృష్ణయ్య విమర్శించారు. రాజకీయాలు ముఖ్యం కాదని ప్రత్యేక హోదా ముఖ్యమన్నారు. 

వెంకయ్య ద్రోహి..రాజీనామా చేయాలి..

కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ద్రోహి అని వెంటనే రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే లక్ష్మణ్ రావు డిమాండ్ చేశారు.కేంద్ర మంత్రులు సుజనా చౌదరి, అశోక్ గజపతి రాజులు రాజీనామా చేయాలని, ప్రత్యేక హోదా కల్పిస్తేనే జీఎస్టీ బిల్లు ఆమోదిస్తామని పార్టీలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 

ట్రంప్‌,మోదీ ఒకేలా మాట్లాడుతున్నారు

 భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్ష పదవి బరిలో ఉన్న రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ ఒకేలా మాట్లాడుతున్నారని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీ విద్యార్థి కన్నయ్యకుమార్‌ విమర్శించారు. ముస్లింలు, ఇతర మైనార్టీలకు వీరిద్దరూ వ్యతిరేకమని ఆరోపించారు.అమెరికాలో ట్రంప్‌ ముస్లింలు, నల్లజాతీయులను దేశం నుంచి వెళ్లిపోవాలని చెబుతుంటే.. ఇక్కడ భారత్‌లో మోదీ కూడా ముస్లింలు, దళితులు, ఇతర మైనార్టీలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని.. వారిద్దరి అభిప్రాయాలు ఒకటేనని వ్యాఖ్యానించారు.

Pages

Subscribe to RSS - August