August

UPA,NDA ఒకటే:నర్సింగరావు

అనకాపల్లిటౌన్‌: జిడిఎస్‌ ఉద్యోగుల వేతన సవరణను 7వ పే కమిషన్‌ పరిధిలోకి చేర్చకుండా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిరాకరించడానికి నిరసిస్తూ స్థానిక పోస్టాఫీసు వద్ద సి,డి,ఇ.డి. ఉద్యోగుల సంఘాల ఆధ్వర్యాన బుధవారం పోస్టల్‌ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు.

అవి యాజమాన్యహత్యలే:ఐద్వా

నారాయణ కళాశాల విద్యార్థినుల మృతిపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయించాలని ఐద్వా, విద్యార్ధి సంఘాలు డిమాండ్‌ చేశాయి. ఐద్వా, డివైఎఫ్‌ఐలు బుధవారం విజయవాడలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించాయి. ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి మాట్లాడుతూ విద్యార్థినులవి ఆత్మహత్యలే ఐతే, అందుకు కారణాలేమిటో కళాశాల యాజమాన్యం వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. కార్పొరేట్‌ కళాశాలల్లో విద్యార్థులు తీవ్రమైన మనోవేదనకు గురవుతున్నారని, విశ్రాంతిలేని చదువులే వారి చావులకు కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

దళితులపై దాడులా?:KVPS

ఎస్‌పి, ఎస్‌టి మహిళలపై ఈ కాలంలో దాడులు విపరీతంగా పెరిగిపోయాయని కెవిపిఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు కె సుబ్రమణ్యం అన్నారు.దళితులు విద్య ,వైద్యం ఉపాధి కరువైందని వీటిని అధికమించడానికి అంబేద్కర్‌ 125వ జయంత్రి సందర్భంగా ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశం నిర్వహించి దళితుల సమస్యలను చర్చించాలన్నారు.ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు సాధనకై ఉద్యమించాలని పిలుపు నిచ్చారు.ప్రభుత్వం అవలబిస్తున్న ఆర్థిక సరళీకరణ విధానాల వల్ల ప్రభుత్వ రంగ సంస్థలు నర్వీర్యమైపోయి ప్రయివేటు పరంగా బలపడుతున్న తరుణంలో దళితులు బలహీన వర్గాలవారికి ఉపాధిలేక వీధిన పడుతుఉన్నారని తెలిపారు

 

చర్చలు తప్ప మరో మార్గం లేదు..

భారత్‌, పాకిస్తాన్‌ జాతీయ సలహాదారు స్థాయీ (ఎన్‌ఎస్‌ఎ) చర్చలు చివరి నిమిషంలో రద్దు కావడం బాధాకరం. ఇరు దేశాల్లోనూ శాంతికి విఘాతం కలిగించాలని కోరుకునే ఛాందసవాద శక్తులకు ఇది ఊతమిస్తోంది. నవంబరు 26 ముంబయి దాడుల తరువాత ప్రతిష్టంభనలోపడిన ద్వైపాక్షిక చర్చలను పునరుద్ధరించేందుకు జరిగిన మరో ప్రయత్నం ఇలా ఆగిపోవడం శోచనీయం. ఈ పరిణామం ఇరుదేశాల్లోని చర్చల ప్రక్రియను వ్యతిరేకించే శక్తులకు సంతోషం కలిగించవచ్చు, కానీ, ఈ ఉపఖండంలో కమ్ముకున్న అనిశ్చితిని తొలగించాలని కోరుకునేవారికి ఇది ఒక విచారకరమైన అంశం.

SEP2సమ్మెకు విస్తృతసన్నాహాలు

కార్మిక చట్టాల సవరణను, ప్రభుత్వ విధానాలకు నిరసనగా సెప్టెంబర్‌ 2న దేశ వ్యాప్తంగా జరుగుతున్న కార్మిక సమ్మెకు విస్తృత సన్నాహాలు చేయాలని సెంటర్‌ ఆఫ్‌ ఇండియన్‌ ట్రేడ్‌ యూనియన్‌(సిఐటియు) జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నేతాజీ పిలుపునిచ్చారు. అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం అంగన్‌వాడీలంతా సమ్మెలో పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు మంగళవారం స్థానిక పాతగుంటూరులోని సంఘ కార్యాలయంలో నిర్వహించిన అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ జనరల్‌ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశానికి కె.నాగలక్ష్మి అధ్యక్షత వహించారు. నేతాజీ మాట్లాడుతూ సమ్మెలో దేశంలోని అన్ని కార్మిక సంఘాలు పాల్గొంటున్నాయని చెప్పారు.

CPM ఆధ్వర్యంలో భూములు దున్నిన పేదలు..

నూజెండ్ల మండలంలోని ముక్కెళ్లపాడు గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెం 5-1లోని ప్రభుత్వభూమిని పేదలకు పంపిణీ చేసి పట్టాలు మంజూరు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు కోరారు. మంగళవారం గ్రామంలోని ప్రభుత్వభూములను ట్రాక్టర్‌తో దున్ని ఎర్రజండాలు పాతి ఆక్రమించారు. పాలక పార్టీలు ఎన్నికలకు ముందు పేదలందరికీ ఇళ్లస్థలాలు, సాగుభూములు ఇస్తామని వాగ్దానం చేసి, నేడు భూములన్నీంటిని కార్పొరేట్‌ సంస్థలకు కట్టబట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. అనేక చోట్ల ప్రభుత్వ భూములకు పెత్తందార్లు పట్టాలు పుట్టించి లక్షలరూపాయలకు అమ్ముకుంటున్నారని చెప్పారు.

బాబు పక్కా బిజినెస్ మాన్:మధు

రాజధాని నిర్మాణం పేరుతో రైతుల వద్ద నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు బలవంతంగా భూ సేకరణ చేస్తున్నారని సిపిఎం రాష్ట్ర కారద్యర్శి పెనుమల్లి మధు అన్నారు. ఏకంగా 1.20 లక్షల ఎకరాలను సేకరిస్తున్నారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 17 లక్షల ఎకరాలతో ల్యాండ్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేయనున్నారని తెలిపారు. వీటిని బడా పారిశ్రామిక వేత్తలకు 99 ఏళ్ల పాటు కారుచౌకగా లీజుకిస్తున్నారని వాపోయారు. చంద్రబాబు చేస్తున్నది పక్కా బిజినెస్‌ అని, అభివృద్ధి కాదని తెలిపారు. పరిశ్రమలు, విమానాశ్రయం పేరుతో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వేలాది ఎకరాలను రైతుల వద్ద నుంచి లాక్కుంటున్నారని తెలిపారు.

 

29నరాష్ట్ర బంద్‌కుCPMమద్దతు

బిజెపి సర్కార్‌పై ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు తెలిపారు. ప్రత్యేకహోదా విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ మొండిచేయి చూపించడతో ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు ముఖంలో నెత్తురులేకుండా పోయిందన్నారు. ఈ నెల 29న రాష్ట్ర బంద్‌కు తాము మద్దతు ప్రకటిస్తున్నామని ప్రకటించారు.

భూసేక‌ర‌ణ‌ను వ్యతిరేకిస్తూ బంద్ సంపూర్ణం..

ప్రభుత్వం తలపెట్టిన బలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తూ ఇచ్చిన బంద్‌ పిలుపు ఉండవల్లిలో సంపూర్ణంగా జరిగింది. ఉదయం నుండే దుకాణాలన్నీ మూతపడ్డాయి. పెట్రోలు బంకుతో సహా పెద్ద వ్యాపారసంస్థలన్నీ స్వచ్ఛంధంగా బంద్‌చేసి రైతులకు తమ సంఘీభావం ప్రకటించారు. ముందుగా సిపిఎం, వైసిపి నాయకులతో కలిసి రైతులు ఉండవల్లి సెంటర్లో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా క్రిడా సిపిఎం కన్వీనర్‌ సిహెచ్‌.బాబురావు మాట్లాడుతూ ప్రభుత్వం నిరంకుశత్వంగా ముందుకెళితే తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వ మెడలు వంచైనా భూసేకరణను నిలుపుదలచేస్తామని చెప్పారు.

నిరుద్యోగం తొలగింపునకు నిర్దిష్ట చర్యలు..

ఉద్యోగిత పెరిగేందుకు నిర్దిష్టమైన చర్యలు తీసుకొని నిరుద్యోగ సమస్యను నియంత్రించాలి. మన దేశంలో ప్రతి సంవత్సరం 1.2 కోట్ల మంది ఉద్యోగం కోసం కొత్తగా మార్కెట్‌లోకి వస్తారు. కాబట్టి యువతీయువకులకు ఉద్యోగాలు, పని కల్పించడం ఒక ప్రధాన సమస్య. కోటీ నాలుగు వేల మందికి ఉద్యోగాలు కావాల్సి ఉండగా లేబర్‌ బ్యూరో (సిమ్లాలో ఉంది) లెక్కల ప్రకారం దుస్తులు, తోళ్ళు, లోహాలు, ఆటోమోబైల్సు, వజ్రాలు, నగలు, రవాణా, ఐటి/బిపిఒ, చేనేత, మర మగ్గాలు- ఈ ఎనిమిది రంగాలలో 2013లో 4.19 లక్షల ఉద్యోగాలే కొత్తగా వచ్చాయి.

Pages

Subscribe to RSS - August