August

విలీన మండలాలపై ఇంత వివక్షా?

టిడిపి ప్రభుత్వం విలీన మండలాలపై తీవ్ర వివక్షను చూపుతోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం. కృష్ణమూర్తి విమర్శించారు. సిపిఎం కూనవరం డివిజన్‌ కమిటీ సమావేశం తూర్పుగోదావరి జిల్లా కూనవరం ఫారెస్టు అతిథి గృహంలో కుంజా సీతారామయ్య అధ్యక్షత న శనివారం జరిగింది. ఈ సందర్భంగా కృష్ణమూర్తి మా ట్లాడుతూ, ఉపాధ్యాయులు లేక విలీన మండలాల్లో ప్రభు త్వ విద్య మరుగున పడిందన్నారు. వైద్యులు, సిబ్బంది కొరతతో గిరిజనులకు వైద్యం దూరమైందన్నారు. మలే రియాతో గిరిజనులు మృత్యువాత పడుతున్నా ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరించడం దారుణమన్నారు.

విద్యార్థుల బలి..

కార్పొరేట్‌ విద్యా సంస్థల ఉక్కుపాదాల కింద విద్యా కుసుమాలు నలిగిపోతున్న ఉదంతాలు ఆందోళన కలిగిస్తుండగా అటువంటి ఉదంతాలు ఇటీవల వరుసగా జరగడం పెను విషాదం. సోమవారం కడప సమీపంలో నారాయణ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థినులు నందిని, మనీషా బలయ్యారు. అంతలోనే గురువారం నెల్లూరు జిల్లా గూడూరులో డిఆర్‌డబ్ల్యు కాలేజీలో బిఎస్‌సి విద్యార్థిని రవళి ప్రాణాలు తీసుకుంది. తమ పిల్లల భవిష్యత్తుపై గంపెడాశతో వేలకు వేలు పోసి ప్రైవేటు కాలేజీల్లో చేర్పిస్తున్న తల్లిదండ్రులకు గర్భశోకం మిగలడం పాషాణ హృదయాలను సైతం కలచివేస్తుంది.

110జీ.ఒ కార్పొరేట్లకి అనుకూలం..

రాజధాని ప్రాంతంలో బలవంతపు భూ సేకరణణను ఆపాలని రైతు సంఘం డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బి.బలరామ్‌, వంగల సుబ్బారావులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 20వ తేదిన జీ.ఒ.నెం.304 విడుదల చేసిందని, దీని ఆధారంగా 26 రెవెన్యూ గ్రామాల పరిధిలో నోటిఫికెేషన్లు జారి చేస్తున్నారని తెలిపారు. ఈ ప్రాంతంలో ప్రభుత్వ భూమి 15 వేల ఎకరాలకు పైగా ఉందని పేర్కొన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలో 50వేల ఎకరాల అటవీ భూమిని ప్రభుత్వం ఢనోీటిఫై చేస్తామని ప్రకటించిందని, కృష్ణా జిల్లాలోనూ నది తీరంలో 10వేల ఎకరాలు తీసుకోవడానికి రంగం సిద్ధమయిందని తెలిపారు.

రాజధాని భూముల్లో నల్లధనం..

ఆంధ్రప్రదేశ్‌ కొత్త రాజధాని భూముల లావాదేవీల్లో నల్లధనం వరదలై పారుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఆదాయ పన్ను శాఖ కళ్లుమూసుకుంటుందా అనే ప్రశ్న తలెత్తుతోంది. రాజధాని గ్రామాలలో గత ఏడాది ఆగస్టు నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ వరకు దాదాపు రూ.10వేల కోట్ల నల్లధనం లావాదేవీలు సాగినట్లు హైకోర్టు న్యాయవాది ఒకరు అంచనా వేశారు. వాటిని పరిశీలించాల్సిందిగా ఆయన డైరెక్టర్‌ ఆఫ్‌ ఇన్‌కంటాక్స్‌ (ఇన్వెస్టిగేషన్‌) కు ఫిర్యాదు చేశారు.

భూ సేకరణ దేనికి? రాజధానికా, విదేశీ కంపెనీలకా?

అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పటి వరకు కొత్త రాజధాని అంశం రాష్ట్రంలో చర్చనీ యాం శంగా ఉంది. మంచి రాజధాని కావాలనే ప్రజల ఆకాంక్షను పాలక తెలుగుదేశం ప్రభుత్వం తన ప్రయోజనాల కోసం వాడు కుంటోంది. భూములు తీసుకో కపోతే రాజధాని నిర్మాణం ఆగిపోతుందని ముఖ్యమంత్రి, మంత్రులు బుకాయిస్తున్నారు. అది నిజమా, కాదా? వాస్తవం ఏమిటి? రాజధాని నిర్మాణానికి 98 శాతం మంది రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చారని, మిగిలిన రెండు శాతం మంది భూములివ్వడం లేదని, అందుకే 3,800 ఎకరాల భూమిని బలవంతంగా సేకరిస్తామని చెబుతు న్నారు. దీనికి ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా గురువారం(20వ తేదీన) జీవో 304ను విడుదల చేసింది.

మాటల కోటలు..

కేంద్రమంత్రివర్యులు వెంకయ్యనాయుడుగారు మరో మారు తన వాచాలతను ప్రదర్శించుకున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో నిట్‌ శంకుస్థాపనకు విచ్చేసిన సందర్భంగా ప్రత్యేక హోదా ప్రకటించాలని విద్యార్థులు నినదించినదే తడవుగా ఆయనకు ఆగ్రహం కట్టలు తెగింది. హోదా విషయమై ప్రతిపక్షం వారి విమర్శలను సైతం మనసులో పెట్టుకున్నట్టున్నారు. ఆవేశం, ఆక్రోశం కలగలిపిన స్వరంతో ఆయన చేసిన ప్రసంగం ఆద్యంతం స్వోత్కర్ష, పరనిందలతోనే సాగింది. వంటికి వేసుకొనే చొక్కా రంగు మొదలుకొని భుజాన మోసే పార్టీ జండా వరకు ఏకరువు పెట్టి రాజకీయాల్లో తానేవిధంగా స్వశక్తితో ఎది గారో గొప్పగా చెప్పుకున్నారు.

విదేశీ వ్యాపారం కోసం బలవంతపు భూసేకరణ..

రాజధాని ప్రాంతంలో సమీకరించిన భూమిని 99 సంవత్సరాలపాటు స్వదేశీ, విదేశీ కంపెనీలకు లీజుకివ్వడానికి ప్రభుత్వం ఇప్పటికే 110 జీవోను విడుదల చేసింది. రాజధాని నిర్మాణానికి, నిర్వహణకు, క్యాపిటల్‌ సిటీ డెవలప్‌మెంట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ కార్పొరేషన్‌(సిసిడిఎంసి)ను ఏర్పాటు చేసింది. ఇందులో తొలుత పది మందిని సభ్యులుగా పెట్టి అనంతరం మరొకరిని పెంచింది. అంటే పదకొండు మందిలో ఏడుగురు ప్రభుత్వాధికారులుంటే నలుగురు పారిశ్రామివేత్తలు డైరెక్టర్లుగా ఉన్నారు. రాజధాని నిర్మాణానికి మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందించి సింగపూర్‌తోపాటు, జపాన్‌, తదితర దేశాలకు అప్పగించనున్నారు.

డిగ్రీలో సెమిస్టర్‌ వద్దు:SFI

డిగ్రీ కళాశాలలో సెమిస్టర్‌ విధానాన్ని విరమించుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్‌ చేసింది. ఈ విధానం వల్ల పేద విద్యార్థులకు కలిగే నష్టాలపై ముద్రించిన కరపత్రాలను విద్యార్థులకు పంపిణీ చేసింది.90 శాతం డిగ్రీ కళాశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు లేవన్నారు. ఇలాంటి స్థితిలో ఆరు నెలల కాలంలో నాలుగు ఇంటర్నల్స్‌, నాలుగు ప్రాక్టికల్స్‌, రెండు సెమిస్టర్‌ పరీక్షల నిర్వహణ ఎలా సాధ్యమని వారు ప్రశ్నించారు. డిగ్రీలో ఉపాధి కోర్సులు ప్రారంభించాలని, ఖాళీగా ఉన్న లెక్చరర్‌ పోస్టులలను వెంటనే భర్తీ చేయాలని, సెమిస్టర్‌ విధానాన్ని రద్దు చేయాలని విద్యార్థులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. 

రైతులఅరెస్టు హేయమైన చర్య:మధు

రాజధాని పరిధిలో భూసేకరణకు ఇచ్చిన నోటిఫికేషన్‌ను వ్యతిరేకిస్తూ రాస్తారోకో చేస్తున్న ప్రతిపక్ష పార్టీల నాయకులను, రైతులను అరెస్టు చేయడం హేయమైన చర్య అని సిపిఎం రాష్ట్ర కార్య దర్శి పి. మధు అన్నారు. అరెస్టు చేయడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. భూసమీ కరణకు భూమి ఇవ్వకుండా ఉన్న రైతుల నుంచి భూమిని తీసుకోవడానికి రాష్ట్ర పభ్రుత్వం భూసే కరణ నోటిఫికేషన్లు జారీ చేసిందన్నారు. దీనికి నిరస నగా ప్రకాశం బ్యారేజి వద్ద ఆదివారం రాస్తారోకో చేస్తున్న వారిని అరెస్టు చేసి పెదకాకాని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారన్నారు. అరెస్టు చేసిన వారిలో సిపిఎం నాయకులు సిహెచ్‌. బాబూరావు, జె.

Pages

Subscribe to RSS - August