August

భారత్‌ పాక్‌ చర్చలే శరణ్యం..ఏచూరి

భారత్‌, పాకిస్తాన్‌ మధ్య ఎన్‌ఎస్‌ఎ స్థాయి చర్చలు రద్దుకావడం దురదృష్ట కరమని సిపిఎం అఖిలభారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. రెండు దేశాల మధ్య సరిహద్దుల్లోని ఉద్రిక్తతలను నివారించాలంటే భారత్‌ చర్చల ప్రక్రియను కొనసాగించాలని ఆయన తెలిపారు. భారత్‌, పాక్‌ మధ్య యుద్దోన్మాదం పెరగడం ఇరువైపుల మత ఛాందసవాద శక్తులు బలోపేతానికి దారితీస్తుందని, ఇది రెండు దేశాల ప్రజల ప్రయోజనాలకు విఘాతమని, ముఖ్యంగా జమ్మూకాశ్మీర్‌పై తీవ్ర ప్రభావం పడుతుందని ఆయన చెప్పారు.'వేర్పాటువాదులతో పాకిస్తాన్‌ దౌత్యవేత్తలు చర్చలు జరిపారనే కారణంతో భారత్‌ ఎన్‌ఎస్‌ఎ స్థాయి చర్చలను రద్దు చేసింది.

CRDA కార్యాలయాల ముట్టడి..

 రాజధాని ప్రాంతంలో గ్రామకంఠాలు, భూసేకరణపై సిపిఎం ఆధ్వర్యంలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని ఉండవల్లి, నవులూరుల్లోని క్రిడా కార్యాలయాలను స్థానికులు సోమవారం ముట్టడించారు. తుళ్లూరు మండలం దొండపాడులోని క్రిడా డిప్యూటీ కలెక్టర్‌ కార్యాలయానికి రాజకీయాలకతీతంగా రైతులు తాళాలేశారు. గ్రామకంఠాల పేరుతో గ్రామాలను ఖాళీ చేయాలనే కుట్ర జరుగుతోందని నినదిస్తూ అధికారులను ఘెరావ్‌ చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్తత ఏర్పడింది. సిపిఎం రాజధాని డివిజన్‌ కార్యదర్శి ఎం.రవి మాట్లాడుతూ, గ్రామాలను ఖాళీ చేయించేందుకే ప్రభుత్వం కుట్రపన్నిందన్నారు.

PACS లను ప్రభుత్వం కాపాడాలి.... సిపియం జిల్లా కార్యదర్శి కె.లోకనాధం

ఈ రోజు విశాఖ జిల్లా డి.సి.ఒ ఆఫీస్ వద్ద జరిగిన ధర్నాలో కె. లోకనాధం మాటలాడుతూ పి.ఎ.సి.ఎస్ ఉద్యోగులకు వెంటనే వేతన సవరణ చేయాలన్నారు. డి.సి.సి.బి నియామకాల్లో పి.ఎ.సి.ఎస్ కోట కొనసాగించాలని, రిటైర్ మెంట్ 60 సంవత్సరాలకు పొడిగించాలన్నారు.  పి.ఎ.సి.ఎస్ ఉద్యోగుల పోరాటాలకు సిపియం పార్టీ  ఎప్పుడు తన మద్దతు ఉంటుందని తెలియజేసారు. ప్రభుత్వం వెంటనే పి.ఎ.సి.ఎస్. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేసారు ....

ఉద్యోగుల డిమాండ్లు ...

నిత్యావసర ధరలు తగ్గించాలి:CPM

 ప్రభుత్వం నిత్యవసర ధరలు తగ్గిం చాలని కర్నూలు సిపిఎం జిల్లా కార్యదర్శి కె ప్రభాకర్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.  రాష్ట్రానికి, దేశానికి ఉల్లిని సరఫరా చేసే కర్నూలులోని బహిరంగ మార్కెట్‌లో ధర రూ.50లు పలుకుతుందని, కందిపప్పు కిలో రూ.100లకు దాటిపోయిందని, కూరగాయలు కొనలేని పరిస్థితిల్లో సామాన్యులు ఉన్నారని తెలిపారు.

37ఏళ్ళ తరువాతCPMనిర్మాణ ప్లీనం

 న్యూఢిల్లీ: పార్టీ నిర్మాణ నివేదికపై అఖిలభారత విస్తృతస్థాయీ సమావేశం (ప్లీనం) డిసెంబరులో కొల్‌కతాలో నిర్వహించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) నిర్ణయించింది. కోల్‌కతాలో ఈ తరహా ప్లీనం నిర్వహించడం 37 సంవత్సరాల తరువాత ఇదే మొదటిసారి. పార్టీ నిర్మాణ బలం, బలహీనతలను మదింపు వేసేందుకు జరిగే ఈ ప్లీనం ఏర్పాట్లపై ఆదివారం నాడిక్కడ ముగిసిన మూడు రోజుల కేంద్ర కమిటీ సమావేశాలలో విస్తృతంగా చర్చించారు.

భూసేకరణకు వ్యతిరేకంగా ఆందోళన..

రాజధాని భూసేకరణ నోటిపికేషన్‌ను వ్యతిరేకిస్తూ వివిధ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన రాస్తారోకోపై పోలీసులు దాష్టీకం ప్రదర్శించారు. ప్రకాశం బ్యారేజ్‌ వద్ద ఆందోళన చేస్తున్న రైతు, ప్రజా, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకుల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. బలవంతంగా అరెస్ట్‌లు చేశారు. అరెస్టు అయినవారిలో సిపిఎం క్రిడా ప్రాంత కన్వీనర్‌ సిహెచ్‌ బాబూరావు, జె శివశంకర్‌, రవి, నవీన్‌, రైతు సంఘం నాయకులు గంగాధరం తదితరులున్నారు. వీరిపై 341, 143 సెక్షన్లపై కేసు నమోదు చేశారు. రాస్తారోకో ప్రారంభం కాకముందే చెల్లాచెదురు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు.

Pages

Subscribe to RSS - August