శ్రీకాకుళం జిల్లా పోలాకిలో థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో అడ్డదార్లు తొక్కుతోంది. ఎనిమిది గ్రామాల్లోని సుమారు రెండు వేల ఎకరాల భూములు గుంజుకోజూస్తున్నది. రైతులు సుక్షేత్రాలైన భూములను కోల్పోతే వ్యవసాయ కార్మికులు, వృత్తిదార్ల జీవనోపాధి పోతుంది. ప్లాంట్ నిర్మాణం చేపట్టడానికి ముందుగా చేయాల్సిన కనీస నియమ నిబంధనలను పాటించకపోవడమేగాక సాధారణ ప్రజాతంత్ర హక్కులను కూడా రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తున్నది. ప్రస్తుతం రాష్ట్రంలోని విద్యుత్‌రంగ పరిస్థితి అంటే ఇప్పుడు పని చేస్తున్న, నిర్మాణంలో ఉన్న, ఇప్పటికే ప్రకటించిన ప్లాంట్లు, విద్యుత్ డిమాండ్, సరఫరా, తదితర వివరాలు చూద్దాం.