శ్రామిక జన శంఖారావం సిడి

సెప్టెంబర్‌ 2న దేశ వ్యాప్త సమ్మె సందర్భంగా సిఐటియు రాష్ట్ర కమిటీి 'శ్రామిక జన శంఖారావం' ప్రచార గీతాల సిడిని శుక్రవారం ఆవిష్కరించింది. యూనియన్‌ ఉపాధ్యక్షురాలు పి. రోజా, కోశాధికారి ఎవి నాగేశ్వరరావుతో కలిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్‌ ఈ సిడిని ఆవిష్కరించారు. అనంతరం గఫూర్‌ విలేకరులతో మాట్లాడుతూ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ విధానాలపై 10 పాటలను రూపొందించి ఈ సిడిలో ఉంచామన్నారు. ప్రచార గీతాలతో రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్‌ 2 సమ్మె ఆవశ్యకతను కార్మిక వర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని సిఐటియు నిర్ణయించిందని, అందులో భాగంగానే ప్రజా నాట్యమండలి సహకారంతో ఈ పాటలను రూపొందించామని చెప్పారు.