
ఉక్కఫ్యాక్టరీ తరలింపు నిర్ణయంపై సోమవారం కడప జిల్లాలో నిరసన వ్యక్తమైంది. సోమవారం ముఖ్యమంత్రి జిల్లా పర్యటన సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అఖిలపక్ష నాయకులు చంద్రబాబును అడ్డుకునే ప్రయత్నం చేశారు. విమానాశ్రయం గేటు ఎక్కిలోనికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులకు నాయకుల మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారులను బలవంతంగా అరెస్టు చేసి వల్లూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.