August

కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి వెన్నులో వ‌ణుకు

కేర‌ళ రాజ‌కీయాల్లో నిర‌స‌న కొత్త పుంత‌లు తొక్కింది. స‌ర్కారు విధానాల‌పై CPM సామాన్యుల‌ను క‌దిలించింది. ఈరోజు కేర‌ళ‌లో సీపీఎం పిలుపుతో 25ల‌క్ష‌ల మంది రోడ్డెక్కారు. 1110 కిలోమీట‌ర్ల పొడ‌వునా మాన‌వ‌హారం సాగించారు. పార్టీ అఖిల భార‌త కార్య‌ద‌ర్శి సీతారం ఏచూరి కూడా పాల్గొన్న ఈ కార్య‌క్ర‌మం ఓ ప్ర‌పంచ రికార్డుగా చెప్ప‌వ‌చ్చు. ప్ర‌జాకంటక కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి వెన్నులో వ‌ణుకుపుట్టిస్తోంది. నిర‌స‌న కార్య‌క్ర‌మానికే ఇంత పెద్ద స్థాయిలో క‌దిలిరావ‌డంతో వారిలో క‌ల‌క‌లం మొద‌ల‌య్యింది. త్వ‌ర‌లో పెనుమార్పుల‌కు సంకేతంగా క‌నిపిస్తోంది.

భారత్‌కు వస్తే ప్రాణ హానే..

భారతదేశానికి తిరిగివస్తే తన ప్రాణాలకే తీవ్ర ముప్పు ఉంటుందని, అందుకే తను వెనక్కి వచ్చే ప్రసక్తే లేదని ఐపిఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ స్పష్టం చేశారు. టి20 క్రికెట్ టోర్నమెంట్‌లో జరిగిన అవకతవకలకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నుంచి తనకు ఇంతవరకు ఎలాంటి సమన్లు అందలేదని తెలిపారు. లలిత్‌మోదీపై దాఖలైన కేసు విషయంలో రెడ్ నోటీసును జారీచేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇంటర్‌పోల్‌ను కోరిన నేపథ్యంలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ముంబై కోర్టు కూడా ఇప్పటికే లలిత్‌మోదీపై నాన్‌బెయిలబుల్ వారెంట్‌ను జారీచేసింది. వీటన్నింటి నేపథ్యంలో మాట్లాడిన లలిత్‌మోదీ ‘నాకింతవరకు ఎలాంటి సమన్లు అందలేదు.

అక్రమంగా మ‌ధు అరెస్ట్..

శ్రీకాకుళం జిల్లాలో పోలాకి ప‌వ‌ర్ ప్లాంట్ నిర్వాసితుల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకోవ‌డానికి వెళ్లిన సిపిఎం  నాయకులపై ప్రభుత్వం నిర్బంధం ప్ర‌యోగించింది. సీపీఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి పి మ‌ధుని దౌర్జన్యంగా  అరెస్ట్ చేసారు. ప‌వ‌ర్ ప్లాంట్ నిర్మాణాన్ని ఇప్ప‌టికే స్థానికులు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. ప‌లు ఉద్య‌మాలు సాగిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో అక్క‌డి ప‌రిస్థితిని తెలుసుకుని, బాధితుల గోడు విన‌డానికి వెళ్లాల‌నుకున్ననాయకుల సమాచారం ముందుగానే  తెలుసుకుని రైల్వే స్టేష‌న్ లో దిగ‌గానే అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేష‌న్ కు త‌ర‌లించారు.

తీవ్ర వ్యవసాయ సంక్షోభం..

పాలకులు అనుసరిస్తున్న విధానాల వల్లనే వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో పడిందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పిన్నమనేని మురళీకృష్ణ అన్నారు. సిపిఎం పామర్రు డివిజన్‌ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికుల నియోజక వర్గ స్థాయి సదస్సులో ఆయన మాట్లాడారు. 11 ఏళ్ళుగా సాగుతున్న పులిచింతల ప్రాజెక్టు పూర్తయి ఉంటే డెల్టాలోని 13 లక్షల ఎకరాల్లో ఈపాటికే ఖరీఫ్‌ వ్యవసాయం పూర్తయి ఉండేదన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య చెప్పిన సమగ్ర నీటి విధానాన్ని కాంగ్రెస్‌, టిడిపి ప్రభుత్వాలు పరిగణనలోకి తీసుకోకపోవటం వల్లనే వ్యవసాయం నీటి ఎద్దడిని ఎదుర్కొంటుందన్నారు.

ప్రజావంచన..

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కాంక్షిస్తూ బెంగళూరు ముని కామకోటి ఆత్మ బలిదానం అత్యంత విషాదకరం. శనివారం తిరుపతిలో కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన సభలో ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేయడం బాధాకరం కాగా కాలిన గాయాలతో ఆసుపత్రిలో ఒక రోజల్లా కొట్టుమిట్టాడి మరణించడం కలచివేసే అంశం. కోటి ఆత్మార్పణం అతని వ్యక్తిగత, కుటుంబ వ్యవహారంతో ముడిపడలేదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని నమ్మించి మోసం చేసిన బిజెపి, టిడిపిల విద్రోహ వైఖరికి నిరసనగా తన ప్రాణాలను పణంగా పెట్టాడు.

కార్మిక చట్టాల సవరణలపై సదస్సు..

కార్పొరేట్‌ సంస్థలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాసోహ మయ్యాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్సివర్గ సభ్యులు ఎంఎ గఫూర్‌ విమర్శించారు. నెల్లూరులో జరిగిన కార్మిక చట్టాల సవరణల సదస్సుల్లో ఆయన ప్రసంగించారు. కార్మికులకు సమ్మె చేసే హక్కును కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం చట్ట సవ రణ చేస్తోందన్నారు. ఒక పథకం ప్రకారం కార్మిక సంఘాల ను నిర్వీర్యం చేసేందుకు నరేంద్రమోడీ ప్రయత్నిస్తున్నారని అన్నారు. బిజెపి మిత్రపక్షమైన టిడిపి కూడా కార్మిక వ్యతిరేక చట్టాలు తెచ్చిందన్నారు. మార్చి 26న కార్మిక చట్టాలకు సవ రణ చేసే బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపిందన్నారు. ఈ బి ల్లును వైసిపి కూడా అడ్డుకోలేదని కార్మికులు గుర్తించాలన్నా రు.

మధు అరెస్ట్ పై ఆందోళన..

సీపీఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి మధు అరెస్టుకి నిరసనగా విజయవాడలో చంద్రబాబు దిష్టి బొమ్మను సిపిఎం కార్యకర్తలు దహనం చేశారు. పోలంకి గ్రామంలో పవర్ ప్లాంట్ నిర్వాసితుల సమస్యలు తెలుపుకోవడం కూడా ఆంధ్రప్రదేశ్ లో తప్పుగా చంద్రబాబు భావిస్తున్నట్లు ఉన్నాడని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు అన్నారు. ప్రజాసమస్యలపై పోరాడుతున్న వాళ్లపై చంద్రబాబు నిరంకుశంగా వ్యవహారిస్తున్నాడని అన్నారు.

Pages

Subscribe to RSS - August