August

భూసేకరణకు నిరసనగా రేపు CRDA వద్ద ధర్నా:AIAWU

రాజధాని గ్రామాల్లో భూ సమీకరణకు ఒప్పుకోని రైతుల భూములను భూ సేకరణ చట్టం ద్వారా స్వాధీనం చేసుకోవాలనే ఉత్తర్వులను ఉప సంహరించాలని అఖిలపక్ష రైతు, వ్యవసాయ కార్మిక, రైతు కూలీ, ప్రజా సంఘాల నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. భూ సేకరణకు నిరసనగా శుక్రవారం క్రిడా కార్యాలయం ఎదుట ధర్నాకు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం, ఏపి వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడలోని ప్రెస్‌క్లబ్‌లో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ నెల 20 నుంచి భూసేకరణ చేపడతామని రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనను సమావేశం ఖండించింది. బలవంతపు భూసేకరణ ప్రయత్నాలను మానుకోవాలని సమావేశంలో పాల్గొన్న నాయకులు డిమాండ్‌ చేశారు.

స్వయంప్రతిపత్తిలో జోక్యమెందుకు : సిపిఎం

జమ్మూ కాశ్మీర్‌కు గల ప్రత్యేక ప్రతిపత్తిని తుడిచిపెట్టేందుకు బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లు నిరంతరాయంగా ప్రయత్నాలు చేస్తూనే వున్నాయని, కానీ ఆ ప్రయత్నాలు ఎప్పుడూ ప్రతికూల ఫలితాలనే ఇస్తున్నాయని సిపిఎం నేత, ఎంఎల్‌ఎ మహ్మద్‌ యూసుఫ్‌ తరిగమి పేర్కొన్నారు. దక్షిణ కాశ్మీర్‌లోని కాజిగండ్‌లో బుధవారం జరిగిన పార్టీ సదస్సులో ఆయన ప్రసంగించారు. ఆయనతో పాటు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి గులాం నబీ మాలిక్‌, ఇతర పార్టీ నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత రాజ్యాంగంలో ఈ మేరకు హామీలు పొందుపరచినప్పటికీ జమ్మూ కాశ్మీర్‌ విషయంలో మాత్రం ఆర్‌ఎస్‌ఎస్‌ మాత్రం తన ఎజెండాను రుద్దాలని చూస్తోందన్నారు.

త్రిపురలో 300కిలోమీటర్ల పొడవునా మానవహారాలు

త్రిపుర రాష్ట్రమంతటా లక్షలాదిమంది ప్రజలు చేయి చేయి కలుపుతూ అది పెద్ద మానవ హారం నిర్మించారు. రాష్ట్రంలో 96 ప్రాంతాల నుంచి 2.25లక్షల మంది ప్రజలు 300 కిలో మీటర్ల పొడవునా బారులు తీరి మానవ హారాలు నిర్మించారు. తద్వారా వామపక్ష ఉద్యమ చరిత్రలో ఓ కొత్త మైలు రాయి నెలకొల్పారు. సిపిఎం త్రిపుర రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఆగస్టు ఉద్యమం ముగింపును పురస్కరించుకుని ఈ మానవ హారాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున ప్రజల్ని సమీకరించడం గతంలో ఎన్నడూ జరగలేదు. అన్ని వర్గాలకు చెందిన ప్రజలు ఇందులో పాల్గొన్నారు.

యుద్ధం ఎవరిపైన?

ఉగ్రవాదంపై యుద్ధం పేరుతో అమెరికా మధ్య ప్రాచ్యంలోని సిరియాలోదురాక్రమణపూరిత యుద్ధానికి తెగబడిన నేపథ్యంలో ప్రధాని నరేందర్‌ మోడీ దుబాయిలోని క్రికెట్‌ స్టేడియం వేదిక నుంచి ఉగ్రవాదంపై ఉమ్మడి పోరుకు పిలుపునిచ్చారు. ఇది కాకతాళీయంగా జరిగిందా లేక ఉద్దేశపూర్వకంగానే జరిగిందా? అన్న విషయం అలా వుంచితే మోడీ ఈ విషయంలో అమెరికా మాజీ అధ్యక్షుడు, యుద్ధోన్మాది జార్జి డబ్ల్యు బుష్‌ నుంచి ప్రేరణపొందినట్లుగా కనిపిస్తోంది . మోడీ ప్రసంగం నాటి బుష్‌ ప్రసంగానికి నకలుగా కనిపిస్తోంది. ఉగ్రవాదంపై పోరులో ప్రపంచమా నీవెటు అని బుష్‌ వల్లించిన డైలాగునే ఇప్పుడు మోడీ వల్లెవేశారు.

సెప్టెంబర్ 2 సమ్మెకు సిపిఎం మద్దతు..

సెప్టెంబరు 2న నిర్వహించే సార్వత్రిక సమ్మెకు సిపిఎం తన సంపూర్ణ మద్ధతు తెలియజేసింది. కాకినాడలో జరిగిన పార్టీ సమావేశంలో పార్టీ రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యుడు దడాల సుబ్బారావు మాట్లాడుతూ కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు సామాన్యులను వంచించి, కార్పొరేట్లకు కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. బ్రిటీష్‌ కాలం నుంచి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తున్నారని చెప్పారు. కార్మిక హక్కులు కాలరాస్తున్న కార్పొరేట్ల కోసమే పాలన సాగిస్తున్న పాలకులకు ఈ సమ్మె ద్వారా కార్మికవర్గ హెచ్చరికను తెలియజేయాలన్నారు. ఏవిధమైన కార్మికుడికైనా కనీస వేతనం రూ.15 వేలు తగ్గకుండా ఉండాలన్నారు.

అక్రమ రెగ్యులరైజేషన్‌పై రైతుల్లో ఆగ్రహం..

కృష్ణా కరకట్ట దిగువ భాగంలో అనుమతులు లేకుండా నిర్మించిన కట్టడాలను రెగ్యులరైజ్‌ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఆ ప్రాంతంలో ముఖ్యమంత్రి తాత్కాలిక నివాసం ఏర్పాటవుతుం డటమే ఇందుకు కారణం.రాజధాని నిర్మాణానికి భూములు సమీకరించిన 29 గ్రా మాలకు సమీపంలో పలువురు రైతులు షెడ్లు, కోళ్ల ఫారాలు, నివాస గృహాలు నిర్మించుకున్నారు. వాటన్నిటినీ పూలింగు కింద ఇవ్వాల్సిందేనని ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి తెచ్చారు. నిర్మా ణాలకు మినహాయింపు ఇవ్వాలని కోరినా ఇవ్వలేదు. పదేపదే మంత్రి నారాయణ చుట్టూ తిరిగినా పట్టించుకోలేదు.

ప్రమాదకరం..

విద్యలో మితిమీరిన కేంద్ర జోక్యానికి, హిందూత్వ భావాలు చొప్పించడానికి తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతుండడం పట్ల ప్రఖ్యాత ఆర్థికవేత్త, నోబెల్‌ అవార్డు గ్రహీత అమర్త్యసేన్‌ వెలిబుచ్చిన ఆందోళన మామూలు విషయం కాదు. అమర్త్యసేన్‌ రాజకీయ నాయకుడు కాదు. ప్రతిపక్షానికి చెందినవాడు అసలే కాదు. ప్రభుత్వ ప్రమాదకర పోకడను చాలా దగ్గర నుంచి పరిశీలించిన ఆర్థికవేత్త. అలాంటి వ్యక్తి ఎన్‌డిఎ ప్రభుత్వ ధోరణిని నిలదీశారంటే పరిస్థితులు ఎంతగా చేజారాయో ఆలోచించాలి. తాజాగా తాను రచించిన 'ది కంట్రీ ఆఫ్‌ ఫస్ట్‌ బార్సు' గ్రంథంలో సర్కారు వైఖరిని సేన్‌ నిరసించారు. విద్యా విషయాల్లో రాజకీయ జోక్యం పరాకాష్టను దాటిందని కుండబద్దలు కొట్టారు.

బాబు,మోడీ ఎవరిపక్షం?:CITU

కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కార్పొరేట్‌ వ్యాపారుల పక్షమో, కష్టజీవుల పక్షమో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఏవి నాగేశ్వరరావు తెలిపారు. సెప్టెంబర్‌ రెండున జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని కోరుతూ రాష్ట్రమంతా పర్యటిస్తున్న బస్సుయాత్ర గురువారం రాత్రి ఒంగోలుకు చేరుకుంది. బస్సుయాత్రకు స్ధానిక దక్షిణ బైపాస్‌ వద్ద ఉన్న జిల్లా పరిషత్‌కార్యాలయం వద్ద వివిధ సంఘాల నేతలు ఘన స్వాగతం పలికారు.

Pages

Subscribe to RSS - August