విలీన మండలాలపై ఇంత వివక్షా?

టిడిపి ప్రభుత్వం విలీన మండలాలపై తీవ్ర వివక్షను చూపుతోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం. కృష్ణమూర్తి విమర్శించారు. సిపిఎం కూనవరం డివిజన్‌ కమిటీ సమావేశం తూర్పుగోదావరి జిల్లా కూనవరం ఫారెస్టు అతిథి గృహంలో కుంజా సీతారామయ్య అధ్యక్షత న శనివారం జరిగింది. ఈ సందర్భంగా కృష్ణమూర్తి మా ట్లాడుతూ, ఉపాధ్యాయులు లేక విలీన మండలాల్లో ప్రభు త్వ విద్య మరుగున పడిందన్నారు. వైద్యులు, సిబ్బంది కొరతతో గిరిజనులకు వైద్యం దూరమైందన్నారు. మలే రియాతో గిరిజనులు మృత్యువాత పడుతున్నా ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరించడం దారుణమన్నారు. ఏడు మండ లాలు విలీనమై 16 నెలలైనా ఒక్క అభివృద్ధి పని కూడా జరగకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. పోలవరంలో తాగునీరు లేక ప్రజలు బురద నీటితోనే కాలం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.