110జీ.ఒ కార్పొరేట్లకి అనుకూలం..

రాజధాని ప్రాంతంలో బలవంతపు భూ సేకరణణను ఆపాలని రైతు సంఘం డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బి.బలరామ్‌, వంగల సుబ్బారావులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 20వ తేదిన జీ.ఒ.నెం.304 విడుదల చేసిందని, దీని ఆధారంగా 26 రెవెన్యూ గ్రామాల పరిధిలో నోటిఫికెేషన్లు జారి చేస్తున్నారని తెలిపారు. ఈ ప్రాంతంలో ప్రభుత్వ భూమి 15 వేల ఎకరాలకు పైగా ఉందని పేర్కొన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలో 50వేల ఎకరాల అటవీ భూమిని ప్రభుత్వం ఢనోీటిఫై చేస్తామని ప్రకటించిందని, కృష్ణా జిల్లాలోనూ నది తీరంలో 10వేల ఎకరాలు తీసుకోవడానికి రంగం సిద్ధమయిందని తెలిపారు. సమీకరించిన భూమిని 99 సంవత్సరాల పాటు స్వదేశీ, విదేశీ కంపెనీలకు లీజుకు ఇవ్వడానికి ప్రభుత్వం ఇప్పటికే 110జీ.ఒ.ని విడుదల చేసిందని తెలిపారు.