రాష్ట్రంలో ఖరీఫ్ వ్యవసాయ పనులు ముమ్మరంగా జరుగుతు న్నాయి. గత వ్యవసాయ లాభ నష్టా లు మరిచిపోయి ఎన్నో ఆశలతో 'సాగు' కదనరంగంలోకి దూకుతున్న 'సాగు' దారులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. రాష్ట్రంలో 20 లక్షల మంది కౌలు రైతులున్నారు. సాగు భూమిలో 70 శాతం పైగా వీరే సాగు చేస్తున్నారు. తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, నెల్లూరు, తదితర జిల్లాల్లో వ్యవసాయరంగంలో కౌలు రైతులే ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. వారి సమస్యలను మాత్రం పాలకులు పట్టించుకోవడం లేదు. ఫలితంగా సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు.