August

2.45కోట్ల ఆహారధాన్యాలు వృథా

ఈ ఏడాది జూన్‌ వరకు భారత ఆహార సంస్థ గిడ్డంగుల్లో రు.2.45కోట్ల విలువ చేసే ఆహార ధాన్యాలు పాడైపోయాయని, క్రమశిక్షణా చర్య తీసుకున్నామని కేంద్ర ఆహారమంత్రి రాం విలాస్‌ పాశ్వాన్‌ శనివారం తెలిపారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని భారత ఆహార సంస్థ గిడ్డంగుల్లో ఆహారధాన్యాలను శాస్త్రీయమైన పద్ధతుల్లో నిల్వ చేస్తారు. జులై ఒకటవ తేది నాటికి 54.5 మిలియన్‌ టన్నుల గోధుమలు, బియ్యంను ఇక్కడ నిల్వ చేసినట్లు తెలిపారు.

స్మార్ట్‌సిటీలలిస్టులోవిజయవాడ

కేంద్ర ప్రభుత్వం విడుదలజేసిన స్మార్ట్‌ సీటీల నామినేషన్‌ జాబితాలో విజయవాడకు చోటు లభించింది. వివిధ రాష్ట్రాల రాజధానులు లక్నో, ముంబయి, గాంధీనగర్‌, జైపూర్‌, భువనేశ్వర్‌, రారుపూర్‌, గౌహతిలతోబాటు విజయవాడ కూడా ఆ జాబితాలో చోటు సంపాదించుకోవడం విశేషం. 100 స్మార్ట్‌ సిటీలకు నామినేట్‌ అయిన వాటిలో పాట్నా, కోల్‌కతా, బెంగుళూరులకు చోటు దక్కలేదు. ఢిల్లీతో సహా అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలూ ఇందులో చేరాయి. తక్కువ ప్రాముఖ్యం కలిగిన నగరాలు, మునిసిపాలిటీలను -బీహార్‌లోని బీహార్‌ షరీఫ్‌, ఉత్తర ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌, సహరాన్‌పూర్‌లు, హిమాచల్‌లోని ధరమ్‌శాల, కర్ణాటకలోని శివమొగ్గలను- రాష్ట్రాలు నామినేట్‌ చేశాయి.

కార్పొరేట్ క‌నుస‌న్నలో మీడియా..

కార్పొరేట్‌ శక్తుల కనుసన్నల్లో నడుస్తున్న ప్రధాన మీడియా కీలకమైన ప్రజాసమస్యలను విస్మరిస్తోందని పీపుల్స్‌ డెమోక్రసీ సంపాదకులు ప్రకాశ్‌కరత్‌ అన్నారు. ప్రజాశక్తి 35వ వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా 'వర్తమాన పరిస్థితులు-మీడియా' అనే అంశంపై శనివారం సాయంత్రం విజయవాడలో జరిగిన సెమినార్‌లో ఆయన పాల్గొన్నారు. ప్రజాశక్తి సంపాదకులు పాటూరు రామయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే కార్పొ రట్లకు, రాజకీయనేతలకు మధ్య అపవిత్ర పొత్తు నెల కొందని, అదే పరిస్థితి మీడియా రంగానికి వ్యాపించిందని చెప్పారు. వ్యాపారస్తులే మంత్రులుగా మారుతున్నారని, మీడియా సంస్థలనూ ఏర్పాట చేస్తున్నారని చెప్పారు.

ప్రజాసమస్యలపై ప్రచారోద్యమం..

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలనూ సమానంగా అభివృద్ధి చేయాలని కోరుతూ సిపిఎం ప్రచారోద్యమం ప్రారంభించింది. స్థానిక సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా శనివారం ఆ పార్టీ శ్రేణులు ప్రజల వద్దకెళ్లి అభివృద్ధికి ఆటంకాలేమిటన్న దానిపై చర్చించారు. వివిధ ప్రాంతాల్లో ప్రజా చైతన్య సదస్సులు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రచారం నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో జరగాల్సిన అభివృద్ధిపై ప్రచారం చేశారు. కరపత్రాలు పంపిణీ చేశారు.

మహిళా ప్రాతినిధ్యం

'అతివలు ఆకాశంలో సగం. అవనిపై సగం' అన్న మాటలు వింటే చాలు మనసు సంతోషంతో ఉప్పొంగుతుంది. కాని అభివృద్ధిలో వారి వెనుకబాటునూ, కట్టుబాట్లమధ్య నలిగిపోతున్న వారి పరిస్థితినీ చూస్తే మనసు దుఖంతో చలించిపోతుంది. బీహార్‌ మహిళలు సరిగ్గా ఈ స్థితిలోనే ఉన్నారు. జనాభా రీత్యా దేశంలోకెల్లా మూడవ అతి పెద్ద రాష్ట్రంగా గుర్తింపు పొందిన బీహార్‌లో మహిళా ఓటర్ల సంఖ్య పురుష ఓటర్లను మించిపోయింది. గత లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల గణాంకాలు ప్రపంచానికి చాటిచెప్పిన వాస్తవమిది.

ఏపీ ప్రత్యేక హోదా పై కారత్

ఏపీకి వెంటనే ప్రత్యేక హోదా కల్పించాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు ప్రకాశ్ కారత్ డిమాండ్ చేశారు. 'ప్రజాస్వామ్యం- కార్పొరేట్ రాజకీయాలుస అనే అంశం పై గుంటూరులో సదస్సు జరిగింది. ఈ సదస్సులో పధ్రాన వ‌క్త‌గా కారత్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ... ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదాపై వాగ్ధానాలు గుప్పించిన బిజెపి ఇప్పుడెందుకు మాట మార్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వలేమని మంత్రి ఇంద్రజిత్ ప్రకటించడం సరికాదన్నారు.

తొక్కిసలాట ఫుటేజి మాయం!

రాజమండ్రి దుర్ఘటనలో ప్రభుత్వ విచారణ తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గోదావరి పుష్కరాల సందర్భంగా గతనెల 14న పుష్కరఘాట్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో 30 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఘాట్‌ వద్ద ఏ విధమైన అవాంఛనీయ ఘటనలు జరిగినా పసిగట్టేందుకు రూ.2 కోట్లు ఖర్చుచేసి ఆర్భాటంగా సిసి కెమెరాలు ఏర్పాటుచేశారు. దీనిపై రెండు రోజుల ముందే ట్రైల్‌ వేశారు. అన్నీ సజావుగా పని చేస్తున్నాయని నిర్ధారించారు. ఇంత పక్కా ఏర్పాట్లు చేసినా జరగాల్సిన ఘోరం జరిగి పోయింది. తొక్కి సలాట ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని... దీనిపై న్యాయ విచారణకు ఆదేశించామని ముఖ్య మంత్రి చంద్రబాబు ప్రకటించారు.

మాప్రాణాలు పోయిన అడ్డుకొంటాం:సిపిఎం

గతంలో పట్టాలిచ్చిన అటవీ భూములను చంద్రబాబు తిరిగి లాక్కోవాలని చూస్తున్నారని,మా ప్రాణాలు పోయినా సరే అడ్డుకొని తీరుతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు హెచ్చరించారు.

ఏపికి ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలకు సిద్ధం

రాష్ట్ర పునర్విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కల్పిస్తామని కేంద్రప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయకపోతే ఉద్యమాలకు సిద్ధం కావాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు పిలుపునిచ్చారు .ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వబోమని శుక్రవారం మరోసారి కేంద్ర మంత్రి లోక్‌సభలో ప్రకటించడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో రాష్ట్ర పునర్విభజన బిల్లుపై చర్చ సందర్భంగా అప్పటి ప్రధాని, ప్రతిపక్షపార్టీ నాయకులు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

Pages

Subscribe to RSS - August