భావ ప్రకటనపై దాడి:SFI

ఢిల్లీ యూనివర్సిటిలోని కిరోరి మాల్‌ కళా శాలలో 2013 ముజఫర్‌నగర్‌ అల్లర్లపై ప్రద ర్శితమవుతున్న డాక్యుమెంటరీని ఏబివిపి కార్యకర్తలు అడ్డుకోవడాన్ని ఎస్‌ఎఫ్‌ఐ ఢిల్లీ విభాగం తీవ్రంగా ఖండించింది. రాజకీయ ప్రాముఖ్యం ఉన్న ఇలాంటి సంఘటనలు విశ్వవిద్యాలయాల్లో పదేపదే పునరావృతం అవుతుండటాన్ని తప్పుపట్టింది. భావ వ్యక్తి కరణ స్వేచ్ఛకు అడ్డుపడే ఈ తరహా ఘటనలు జరగకుండా ఉండేందుకు అందరూ ఐక్యం కావాల్సిందిగా విద్యార్ధులు, ఉపాధ్యాయులు, ఇతర ప్రజా సంఘాలను కోరింది. 2013లో ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో తీవ్రమైన మత అల్లర్లు చెలరేగి 60మంది మృతిచెం దగా, దాదాపు 50వేల మంది ముస్లిములు బలవంతంగా ఇళ్లు ఖాళీ చేయవలసి వచ్చిం ది. ఈ దాడుల వెనుక ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి హస్తం ఉందన్నది జగమెరిగిన సత్యం. నాటి దాడులకు సంబం ధించిన బాధితుల ఇంటర్వ్యూలతో తీసిన '' ముజఫ ర్‌నగర్‌ బాక్వీ హాయి'' అనే డాక్యుమెంటరీని ఢిల్లీ ఫిల్మ్‌ సోసైటి కాలేజ్‌ సమీపంలో ప్రదర్శిస్తుండగా ఏబివిపి కార్యకర్తలు దాడి చేశారు. 25-30 మంది ఏబివిపి కార్యకర్తలు కాలేజ్‌లోని సెమినార్‌ హాల్‌లోకి చొరబడి దౌర్జన్యానికి దిగారు. ఇలా యూనివర్సిటిలో దాడులకు దిగడం ఏబివిపి కార్యకర్తలకు కొత్తేమీ కాదు. గతంలో కూడా మత అల్లర్లకు సంబంధించిన విషయాల్ని ప్రదర్శించోద్దంటూ ఏబివిపి యూనివర్సిటి బంద్‌కు పిలుపునిచ్చి విద్యార్ధుల, ఉపాధ్యాయుల, ఇతరుల భావవ్యక్తీకరణ స్వేచ్చపై దాడి చేసింది. దేశంలో జరుగుతున్న రోజువారి విషయాలపై చర్చించే బాధ్యత యూనివర్సిటిలకు ఉందని, వాటిపై దాడులకు దిగడం అనేది అనాగరిక చర్యని ఎస్‌ఎఫ్‌ఐ వ్యాఖ్యానించింది.