రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజధాని నిర్మాణం విషయంలో తీవ్ర గందరగోళంలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ ప్రాంతంలో రైతుల నుండి భయపెట్టి ఇప్పటి వరకు 33,500 ఎకరాల భూమి తీసుకున్న ప్రభుత్వం సింగపూర్, జపాన్ ప్రతినిధులతో చర్చలు జరిపారు. అనంతరం ఊహాచిత్రాలు విడుదల చేసి రాజధాని నిర్మాణం ఆగమేఘాలమీద జరిగిపోతుందని అరచేతిలో వైకుంఠం చూపించారు. రెండు రోజుల నుండి పత్రికల్లో (ముఖ్యమంత్రి అనుకూల పత్రిక) ప్రభుత్వం, ముఖ్యమంత్రి ప్రకటనల తీరు మారింది. టర్కీ దేశ రాజధాని ఇస్తాంబుల్ తరహాలో నిర్మాణం చేపడతామని వార్తలు లీక్ చేయడం స్థానికంగా కలకలం రేపింది.