ద్రవ్యోల్బణం బయపెడుతోంది..

ప్రస్తుత పరిస్థితులలో ఆర్థిక వ్యవస్థలో సర్దుబాటు వైఖరిని నిర్వహించేందుకు వడ్డీరేట్ల కోతల జోలికి పోలేదని రాజన్‌ అన్నారు. గతంలో చేసిన వడ్డీకోతల ఫలితాలను బ్యాంకులు పూర్తిస్థాయిలో ప్రజలకు అందించకపోవడం, ఆహార ధరలు, అమెరికా కేంద్ర బ్యాంకు వడ్డీరేట్లను సాధారణీకీరణ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని భవిష్యత్తులో వడ్డీరేట్లను తగ్గించనున్నట్లుగా ఆయన తెలిపారు. ఆహార, ఇంధన ధరలను మినహాయించిన ద్రవ్యోల్బణం మరింతగా బలపడుతుండడం చింతించాల్సి అంశాలుగా ఉన్నాయన్నారు.