ప్రభుత్వ విద్యకు నిధులు పెంచాలి - సి.పి.యం జిల్లా కార్యదర్శి పాశం రామారావు.

సి.పి.యం ప్రచార కార్యాక్రమంలో బాగంగా చుట్టుకుంట సెంటర్ లో విద్యార్ధులతో పాశం రామారావు మాట్లడుతూ ప్రభుత్వ విద్యా సంస్థలకు నిధులు కేటాయించి బలోపేతం చేయాలన్నారు. ఎంతో అభివృద్ది చెందినదని చెప్పుకుంటున్న జిల్లాలో సుమారు 16 మండలలో 50 శాతం లోపు అక్షరాస్యతతోనే ఉన్నాయని, వాటిల్లో 15 మండలాలు పల్నాడు ప్రాతంలోనే ఉండటం శోచనీయమన్నారు ఇబ్బడి ముబ్బడిగా ఇంజనీరింగ్ కాలేజీలు పెరిగినా ఉపాధి మాత్రం చాలా నామమాత్రంగా ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహలు మౌలిక వసతులు కల్పించకపొవటంతో కునారిల్లుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నగర కార్యదర్శి ఎన్. భావన్నారాయణ మాట్లాడుతూ నగరంలో మున్సిపల్ పాఠసాలల్లో అనేక సమస్యలున్నాయని, అదనపు తరగతి గదులు నిర్మించాలని, మరుగుదొడ్లు సౌకర్యం మెరుగుపర్చాలన్నారు, అలాగే నూతనంగా ఏర్పడిన కాలనీల్లో, ప్రతాల్లో, ప్రభుత్వ విద్యా సంస్థలు ఏర్పాటు చేయాలన్నారు. నగరంలో పలు కూడళ్ల, విద్యా సంస్థలు వద్ద కరపత్రాలు పంచుతూ విద్యా రంగంలో నెలకొన్న సమస్యలు, పరిష్కారాలు, ప్రభుత్వ విధానలపై అవగాహన కల్పించారు.