లక్షల కోట్లుండి జైల్లోనా:SC

సహారా గ్రూపు ఛైర్మన్‌ సుబ్రతా రారుపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం  చేసింది. రూ.1,85,000 కోట్ల ఆస్తులు ఉంచుకుని, అందులో ఐదో వంతు చెల్లించి సమస్యల నుంచి బయట పడవచ్చుగా అని పేర్కొంది. జైల్లో ఉండాలనకుంటే నీ ఇష్టమని న్యాయమూర్తి టిఎస్‌ ఠాకూర్‌తో కూడిన ధర్మాసనం రారుకు సూచించింది. అనేక వ్యాపారాలు కలిగిన రారును జైల్లో ఉంచడం సరైంది కాదని ఆయన తరుపు న్యాయవాధి సీనియర్‌ అడ్వకేట్‌ కపిల్‌ సిబల్‌ కోర్టులో వాధించారు. అనేక వ్యాపార సంస్థలు అప్పులు పడి ఉన్నాయని, అలాంటి వాటిని ఆర్‌బిఐ, బ్యాంకులు ఐదు, పదేళ్ల పాటు పునరుద్దరిస్తున్నాయని పేర్కొన్నారు. రారును జైల్లో ఉంచడం ద్వారా నగదు సమీకరించి చెల్లించడం కష్టమని పేర్కొన్నారు. మానవత దృక్పతంతో కోర్టు ఆయన్ను విడుదల చేయాలన్నారు. దీనికి సమాధానంగా కేసు పూర్వాపరాలు చదువుకొని రావాలని సిబల్‌కు ధర్మాసనం సూచించింది. రారు జైల్లో ఎందుకు ఉన్నారో తెలుసుకోవాలని చురకలంటించింది.