August

సమస్యలకు నిలయంగా ప్రభుత్వ ఆసుపత్రులు -

సమస్యల నిలయంగా అనకాపల్లి ఆసుపత్రి..
సరిపడిన స్టాప్ లేకపోవడంతో అవస్ధలు పడుతున్న రోగులు..
కొన్ని రోగాలకు దోరకని మందులు..
ప్రజారోగ్యవ్యవస్ధను నీరుకారుస్తున్నరని ప్రభుత్వం పై మండిపాటు..
ఆరోగ్యవ్యవస్ధ పరిరక్షణాకే ఉధ్యమిస్తాం..

ప్రచారోద్యమంలో భాగంగా అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రి సర్వేలో పాల్గోన్న సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి కె.లోకనాధం , అనకపల్లి డివిజన్ కార్యదర్శి ఎ. బాలకృష్ణ...

RR ACT ప్రయోగిస్తే ఊరుకోం:AIKS

ఓపక్క రుణమాఫీ చేశామని ప్రభుత్వం ప్రకటిస్తుంటే... మరోపక్క అప్పు కట్టాలని బ్యాంకులు ఒత్తిడి చేస్తున్నాయి. ఇప్పుడు మా కష్టం ఎవరితో చెప్పుకోవాలి' అని రైతులు ప్రశ్నిస్తున్నారు. బ్యాంకులు అప్పుల వసూళ్లకు దిగుతుండడం.., వర్షాభావంతో ఇప్పటికే పెట్టిన పెట్టుబడులు భూమిలోనే ఇంకిపోవడంతో 'అనంత' రైతున్నలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో కనికరించి రుణవసూళ్లను వాయిదా వేయకపోగా, నోటీసులు పంపి రైతులను మరింత ఆందోళనకు గురిచేయడం పట్ల ఎపి రైతుసంఘం జిల్లా కార్యదర్శి పి.పెద్దిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు.. RR ACT ప్రయోగిస్తే ఊరుకోమని హెచ్చరించారు .

సంస్కారం

తాము నమ్మిన సంప్రదాయమే సంస్కారం అనుకునేవారికి నిజమైన మానవీయ స్పర్శ ఎలా వుంటుందో చూపించడం అంత సులభం కాదు. చలనం లేని వాళ్లను కదిలించాలంటే సంచలనం తీసుకురావలసి వుంటుంది. ఓ నాలుగు దశాబ్దాల కిందట భారత దేశానికి ప్రత్యేకించి దక్షిణ భారత దేశానికి ఆ విధమైన అనుభవం ఇచ్చిన కన్నడ నవల 'సంస్కార'. సాహిత్య కారులు పాఠకులు ఎవ రైనా సరే ఇతర భాషల దేశాల పుస్తకాలుకూడా చూడకుండా అవగా హనా పరిధి పెంచుకోలేరు.కనీసం ప్రసిద్ధ రచనలు ప్రసిద్ధుల రచనలైనా చూడకపోతే అదొక లోటుగానే వుండిపోతుంది. అందుకే 'సంస్కార' తెలుగు అనువాదం ఇప్పుడు ప్రజాశక్తి ప్రచురణగా రావడం స్వాగతించదగింది. తెలుగులో సమస్యాత్మక నవలలే తక్కువగా వస్తున్న తరుణం.

కార్పొరేట్లకు ఆదివాసీ భూములా?

దేశంలో కార్పొరేట్‌ కంపెనీలకు కట్టబెట్టేందుకు ఆదివాసీల భూములే దొరికాయా అని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకారత్‌ ప్రశ్నించారు. బుధవారం ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో త్రిపుర ఎంపి జితేంద్ర చౌదరి అధ్యక్షతన ఆదివాసీి అధికార్‌ సంఘర్ష్‌ జాతీయ సమ్మేళనం జరిగింది. గిరిజన విద్యార్థుల సంబంధించి విద్య, గిరిజన యువతకి సంబంధించి ఉపాధి కల్పన, జాతీయ వనరులు ఆదివాసులవేనని, ట్రైబల్‌ సబ్‌ప్లాన్‌కు సంబంధించి మూడు తీర్మానాలను సదస్సు ఆమోదించింది. ఈ సమావేశంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న బృందా కారత్‌ మాట్లాడుతూ, దేశంలో మోడీ గద్దెనెక్కేనాటి నుండి ప్రజావ్యతిరేక విధానాలతో ప్రజల నడ్డి విరుస్తున్నారని ధ్వజమెత్తారు.

బుల్లెట్ రైళ్లా..! :CPM

రైల్వే ప్రయాణీకులకు కావల్సింది బుల్లెట్‌ రైళ్లు కాదని, ప్రయాణంలో వారికి భద్రత కల్పించాలని అని సిపిఎం పొలిట్‌బ్యూరో కేంద్ర ప్రభుత్వానికి హితవు పలికింది. మంగళవారం అర్ధరాత్రి మధ్యప్రదేశ్‌లోని జరిగిన జంట రైలు ప్రమాదాలపై పొలిట్‌బ్యూరో దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. రైల్వేలలో తరచు జరుగుతున్న ఈ ప్రమాదాలలో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నా రైల్వే శాఖ పరిస్థితులపైన, భద్రతా ప్రమాణాలపైన ప్రభుత్వం ఇంకా కళ్లు తెరవటం లేదని, షరామామూలుగా భద్రతా కమిషనర్‌తో కంటితుడుపు దర్యాప్తునకు ఆదేశాలుజారీ చేసిందని విమర్శించింది.

సమర్థనీయం కాదు..

ఉన్నత పదవుల్లో అవినీతిపై చర్య తీసుకోవాలని పట్టుబట్టినందుకు పాతికమంది కాంగ్రెస్‌ ఎంపీలను పార్లమెంటు నుంచి అయిదు రోజులపాటు గెంటివేసిన స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ చర్య ఏ విధంగానూ సమర్థనీయం కాదు. ఇందిర ఎమర్జెన్సీకి 40 ఏళ్లు గడిచిన సందర్భంలోనే దేశంలో మోడీ ఏలుబడిలో మళ్లీ అటువంటి నిరంకుశ పోకడలు వ్యక్తమవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. సభ్యులు ఉద్దేశపూర్వకంగానే సభకు అంతరాయం కలిగించారని, అందుకే నిబంధనల ప్రకారం వారిపై చర్య తీసుకోవాల్సి వచ్చిందని స్పీకర్‌ తన చర్యను సమర్థించుకున్నారు. స్పీకర్‌ చెప్పిందే వాస్తవమైతే మొదట వేటు ప్రభుత్వంపై పడాలి. ఎందుకంటే సభ సజావుగా సాగకపోవడానికి ప్రభుత్వమే అసలు ముద్దాయి.

అణు ఒప్పందం-ప్రతికూల పర్యవసానాలు

భారత్‌-అమెరికా అణు ఒప్పందాన్ని 2005 జులై 18న ప్రకటించారు. ఇప్పటికి పదేళ్ళు గడిచింది. ప్రారంభం నుంచీ సిపిఎం, ఇతర వామపక్షాలు ఈ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూనే వచ్చాయి. అప్పటి మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం అమెరికాతో పెట్టుకోవాలనుకున్న విస్తృత శ్రేణి వ్యూహాత్మక పొత్తులో ఇది కీలక భాగంగా వామపక్షాలు భావించాయి. ఈ ఒప్పందంలోని ప్రతి అంశం పట్ల వామపక్షాలు ప్రదర్శించిన వ్యతిరేకత పదేళ్ళ తర్వాత కూడా వాస్తవమేనని రుజువైంది.
బూటకపు వాదనలు

Pages

Subscribe to RSS - August