సమస్యలకు నిలయంగా ప్రభుత్వ ఆసుపత్రులు -

సమస్యల నిలయంగా అనకాపల్లి ఆసుపత్రి..
సరిపడిన స్టాప్ లేకపోవడంతో అవస్ధలు పడుతున్న రోగులు..
కొన్ని రోగాలకు దోరకని మందులు..
ప్రజారోగ్యవ్యవస్ధను నీరుకారుస్తున్నరని ప్రభుత్వం పై మండిపాటు..
ఆరోగ్యవ్యవస్ధ పరిరక్షణాకే ఉధ్యమిస్తాం..

ప్రచారోద్యమంలో భాగంగా అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రి సర్వేలో పాల్గోన్న సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి కె.లోకనాధం , అనకపల్లి డివిజన్ కార్యదర్శి ఎ. బాలకృష్ణ...

జిల్లా కార్యదర్శి మాటలాడుతూ జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్లు, ఇతర సిబ్బంది ఖాళీలు , వివిధ కేటగిరీలకు చెందిన 520 పోస్టులు ఏళ్ళ తరబడి భర్తీ కావడంలేదు. సబ్ సెంటర్లు అత్యదికంగా అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. జనాభాకు అవసరాలకు సరిపడా మందులు సరఫరా లేదు. ఏరియా ఆసుపత్రుల్లో స్పెషలిస్ట్ డాక్టర్లు లేరు. దీని కారణంగా ఏజెన్సీలో వైద్య సదుపాయాలు లేక ప్రజలు మృత్యువాత పడుతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వానికి చిమకుటినట్లు కూడా లేకపోవడం సిగ్గు చేటు...... ఈ సమస్యలు పరిష్కారం కోసం ఆగష్టు 14 న అన్ని మండల కార్యాలయాలు వద్ద జరిగే ధర్నాలో ప్రజలు, మేధావులు, ఉద్యోగులు, కార్మికులు అందరు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు ....