కులాలు, మతాలు, మతతత్వం వంటి అంశాలు ప్రాబల్యం చూపుతున్న నేటి పరిస్థితుల్లో సమాజాన్ని మేల్కొలిపేది సాహిత్యమేనని సాహిత్య ప్రస్థానం ఎడిటర్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి పిలుపునిచ్చారు. సాహితీ స్రవంతి ద్వితీయ వార్షికోత్సవం ఆదివారం స్థానిక రోటరీ క్లబ్ హాల్లో జరిగింది. ప్రముఖ కవి డాక్టర్ అదేపల్లి రామ్మోహనరావు అధ్యక్షతన జరిగిన ప్రారంభ సభలో ఎంఎల్‌సి రాము సూర్యా రావుతోపాటు తెలకపల్లి రవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా రవి మాట్లా డుతూ సాహిత్యం నేటి యువత రాన్నీ, విద్యార్థులనూ ఆకట్టు కునేలా ఉండాలన్నారు.