August

తీవ్ర వ్యవసాయ సంక్షోభం..

పాలకులు అనుసరిస్తున్న విధానాల వల్లనే వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో పడిందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పిన్నమనేని మురళీకృష్ణ అన్నారు. సిపిఎం పామర్రు డివిజన్‌ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికుల నియోజక వర్గ స్థాయి సదస్సులో ఆయన మాట్లాడారు. 11 ఏళ్ళుగా సాగుతున్న పులిచింతల ప్రాజెక్టు పూర్తయి ఉంటే డెల్టాలోని 13 లక్షల ఎకరాల్లో ఈపాటికే ఖరీఫ్‌ వ్యవసాయం పూర్తయి ఉండేదన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య చెప్పిన సమగ్ర నీటి విధానాన్ని కాంగ్రెస్‌, టిడిపి ప్రభుత్వాలు పరిగణనలోకి తీసుకోకపోవటం వల్లనే వ్యవసాయం నీటి ఎద్దడిని ఎదుర్కొంటుందన్నారు.

ప్రజావంచన..

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కాంక్షిస్తూ బెంగళూరు ముని కామకోటి ఆత్మ బలిదానం అత్యంత విషాదకరం. శనివారం తిరుపతిలో కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన సభలో ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేయడం బాధాకరం కాగా కాలిన గాయాలతో ఆసుపత్రిలో ఒక రోజల్లా కొట్టుమిట్టాడి మరణించడం కలచివేసే అంశం. కోటి ఆత్మార్పణం అతని వ్యక్తిగత, కుటుంబ వ్యవహారంతో ముడిపడలేదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని నమ్మించి మోసం చేసిన బిజెపి, టిడిపిల విద్రోహ వైఖరికి నిరసనగా తన ప్రాణాలను పణంగా పెట్టాడు.

కార్మిక చట్టాల సవరణలపై సదస్సు..

కార్పొరేట్‌ సంస్థలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాసోహ మయ్యాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్సివర్గ సభ్యులు ఎంఎ గఫూర్‌ విమర్శించారు. నెల్లూరులో జరిగిన కార్మిక చట్టాల సవరణల సదస్సుల్లో ఆయన ప్రసంగించారు. కార్మికులకు సమ్మె చేసే హక్కును కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం చట్ట సవ రణ చేస్తోందన్నారు. ఒక పథకం ప్రకారం కార్మిక సంఘాల ను నిర్వీర్యం చేసేందుకు నరేంద్రమోడీ ప్రయత్నిస్తున్నారని అన్నారు. బిజెపి మిత్రపక్షమైన టిడిపి కూడా కార్మిక వ్యతిరేక చట్టాలు తెచ్చిందన్నారు. మార్చి 26న కార్మిక చట్టాలకు సవ రణ చేసే బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపిందన్నారు. ఈ బి ల్లును వైసిపి కూడా అడ్డుకోలేదని కార్మికులు గుర్తించాలన్నా రు.

మధు అరెస్ట్ పై ఆందోళన..

సీపీఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి మధు అరెస్టుకి నిరసనగా విజయవాడలో చంద్రబాబు దిష్టి బొమ్మను సిపిఎం కార్యకర్తలు దహనం చేశారు. పోలంకి గ్రామంలో పవర్ ప్లాంట్ నిర్వాసితుల సమస్యలు తెలుపుకోవడం కూడా ఆంధ్రప్రదేశ్ లో తప్పుగా చంద్రబాబు భావిస్తున్నట్లు ఉన్నాడని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు అన్నారు. ప్రజాసమస్యలపై పోరాడుతున్న వాళ్లపై చంద్రబాబు నిరంకుశంగా వ్యవహారిస్తున్నాడని అన్నారు.

అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం ఎవరి కోసం?

ఆధునిక సమాజ గత కాలపు ఆనవాళ్లు ఆదివాసీ ప్రజలు. సమిష్టి జీవన పద్ధతు లు, సహజీవనం, పారదర్శ కతకు నిలువెత్తు సాక్షులు వారు. వ్యష్టి జీవన పద్ధతులు, పరస్పర అసహనం, కని పించ ని కుట్రలు నేటి పారి శ్రామిక సమాజ లక్షణాలు. బ్రెజిల్‌, పెరూ దేశాలలో వందకుపైగా ఆదివాసి తెగలు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఉన్నారు. పెరూలోని 'ముచి-పిచి' పర్యావరణ పార్కుకు కేవలం 100 కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో ఈ తెగలు ఇప్పటికీ జంతుప్రాయమైన జీవనాన్ని కొనసాగిస్తున్నారు. 50-60 వేల సంవత్సరాల నుంచి అటవీ దుంపలు ప్రధాన ఆహార వనరుగా జీవిస్తూ మొక్కజొన్న, బంగాళాదుంప సాగుకు ఈ తెగలు ఎంతో తోడ్పడ్డాయి.

Pages

Subscribe to RSS - August