తీవ్ర వ్యవసాయ సంక్షోభం..

పాలకులు అనుసరిస్తున్న విధానాల వల్లనే వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో పడిందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పిన్నమనేని మురళీకృష్ణ అన్నారు. సిపిఎం పామర్రు డివిజన్‌ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికుల నియోజక వర్గ స్థాయి సదస్సులో ఆయన మాట్లాడారు. 11 ఏళ్ళుగా సాగుతున్న పులిచింతల ప్రాజెక్టు పూర్తయి ఉంటే డెల్టాలోని 13 లక్షల ఎకరాల్లో ఈపాటికే ఖరీఫ్‌ వ్యవసాయం పూర్తయి ఉండేదన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య చెప్పిన సమగ్ర నీటి విధానాన్ని కాంగ్రెస్‌, టిడిపి ప్రభుత్వాలు పరిగణనలోకి తీసుకోకపోవటం వల్లనే వ్యవసాయం నీటి ఎద్దడిని ఎదుర్కొంటుందన్నారు. పట్టిసీమ నిర్మాణంలో కూడా నిర్మాణ కంపెనీల స్వార్ధం ఇమిడి ఉందన్నారు. ఆగస్టు 15 నాటికి పట్టిసీమ ప్రాజెక్టు నుంచి నీరు వస్తుందని చెప్పడం కూడా రైతులు మరోసారి మోసపోవటమేనన్నారు.