August

యుద్ధం ఎవరిపైన?

ఉగ్రవాదంపై యుద్ధం పేరుతో అమెరికా మధ్య ప్రాచ్యంలోని సిరియాలోదురాక్రమణపూరిత యుద్ధానికి తెగబడిన నేపథ్యంలో ప్రధాని నరేందర్‌ మోడీ దుబాయిలోని క్రికెట్‌ స్టేడియం వేదిక నుంచి ఉగ్రవాదంపై ఉమ్మడి పోరుకు పిలుపునిచ్చారు. ఇది కాకతాళీయంగా జరిగిందా లేక ఉద్దేశపూర్వకంగానే జరిగిందా? అన్న విషయం అలా వుంచితే మోడీ ఈ విషయంలో అమెరికా మాజీ అధ్యక్షుడు, యుద్ధోన్మాది జార్జి డబ్ల్యు బుష్‌ నుంచి ప్రేరణపొందినట్లుగా కనిపిస్తోంది . మోడీ ప్రసంగం నాటి బుష్‌ ప్రసంగానికి నకలుగా కనిపిస్తోంది. ఉగ్రవాదంపై పోరులో ప్రపంచమా నీవెటు అని బుష్‌ వల్లించిన డైలాగునే ఇప్పుడు మోడీ వల్లెవేశారు.

సెప్టెంబర్ 2 సమ్మెకు సిపిఎం మద్దతు..

సెప్టెంబరు 2న నిర్వహించే సార్వత్రిక సమ్మెకు సిపిఎం తన సంపూర్ణ మద్ధతు తెలియజేసింది. కాకినాడలో జరిగిన పార్టీ సమావేశంలో పార్టీ రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యుడు దడాల సుబ్బారావు మాట్లాడుతూ కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు సామాన్యులను వంచించి, కార్పొరేట్లకు కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. బ్రిటీష్‌ కాలం నుంచి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తున్నారని చెప్పారు. కార్మిక హక్కులు కాలరాస్తున్న కార్పొరేట్ల కోసమే పాలన సాగిస్తున్న పాలకులకు ఈ సమ్మె ద్వారా కార్మికవర్గ హెచ్చరికను తెలియజేయాలన్నారు. ఏవిధమైన కార్మికుడికైనా కనీస వేతనం రూ.15 వేలు తగ్గకుండా ఉండాలన్నారు.

అక్రమ రెగ్యులరైజేషన్‌పై రైతుల్లో ఆగ్రహం..

కృష్ణా కరకట్ట దిగువ భాగంలో అనుమతులు లేకుండా నిర్మించిన కట్టడాలను రెగ్యులరైజ్‌ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఆ ప్రాంతంలో ముఖ్యమంత్రి తాత్కాలిక నివాసం ఏర్పాటవుతుం డటమే ఇందుకు కారణం.రాజధాని నిర్మాణానికి భూములు సమీకరించిన 29 గ్రా మాలకు సమీపంలో పలువురు రైతులు షెడ్లు, కోళ్ల ఫారాలు, నివాస గృహాలు నిర్మించుకున్నారు. వాటన్నిటినీ పూలింగు కింద ఇవ్వాల్సిందేనని ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి తెచ్చారు. నిర్మా ణాలకు మినహాయింపు ఇవ్వాలని కోరినా ఇవ్వలేదు. పదేపదే మంత్రి నారాయణ చుట్టూ తిరిగినా పట్టించుకోలేదు.

ప్రమాదకరం..

విద్యలో మితిమీరిన కేంద్ర జోక్యానికి, హిందూత్వ భావాలు చొప్పించడానికి తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతుండడం పట్ల ప్రఖ్యాత ఆర్థికవేత్త, నోబెల్‌ అవార్డు గ్రహీత అమర్త్యసేన్‌ వెలిబుచ్చిన ఆందోళన మామూలు విషయం కాదు. అమర్త్యసేన్‌ రాజకీయ నాయకుడు కాదు. ప్రతిపక్షానికి చెందినవాడు అసలే కాదు. ప్రభుత్వ ప్రమాదకర పోకడను చాలా దగ్గర నుంచి పరిశీలించిన ఆర్థికవేత్త. అలాంటి వ్యక్తి ఎన్‌డిఎ ప్రభుత్వ ధోరణిని నిలదీశారంటే పరిస్థితులు ఎంతగా చేజారాయో ఆలోచించాలి. తాజాగా తాను రచించిన 'ది కంట్రీ ఆఫ్‌ ఫస్ట్‌ బార్సు' గ్రంథంలో సర్కారు వైఖరిని సేన్‌ నిరసించారు. విద్యా విషయాల్లో రాజకీయ జోక్యం పరాకాష్టను దాటిందని కుండబద్దలు కొట్టారు.

బాబు,మోడీ ఎవరిపక్షం?:CITU

కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కార్పొరేట్‌ వ్యాపారుల పక్షమో, కష్టజీవుల పక్షమో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఏవి నాగేశ్వరరావు తెలిపారు. సెప్టెంబర్‌ రెండున జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని కోరుతూ రాష్ట్రమంతా పర్యటిస్తున్న బస్సుయాత్ర గురువారం రాత్రి ఒంగోలుకు చేరుకుంది. బస్సుయాత్రకు స్ధానిక దక్షిణ బైపాస్‌ వద్ద ఉన్న జిల్లా పరిషత్‌కార్యాలయం వద్ద వివిధ సంఘాల నేతలు ఘన స్వాగతం పలికారు.

మోడీ అన్నింటా వైఫల్యం:కారత్

ప్రధాని నరేంద్రమోడీ అన్నింటా వైఫల్యం చెందారని సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు  ప్రకాశ్ కరత్ పేర్కొన్నారు. నగరాలు, పట్టణాల్లో ఎలాంటి మార్పు రాలేదన్నారు. పాఠశాలల మరుగుదొడ్ల నిర్మాణాల్లో సరిపోలని లెక్కలున్నాయన్నారు. మరుగుదొడ్లు నిర్మించినా నీటి సమస్య నిర్వహణ లోపం ఉందన్నారు. జన్ ధన్ యోజన పథకం నిద్రావస్థలో ఉందని ఎద్దేవా చేశారు. రూ. 17 కోట్ల జన్ ధన్ ఖాతాల్లో పైసా లేదని విమర్శించారు. మేక్ ఇన్ ఇండియా పథకం ఎక్కడి గొంగళి అక్కడేనన్న చందంగా ఉంది అన్నారు. కేంద్రమంత్రులు కుంభోణాల్లో మునిగితేలుతున్నారని విమర్శించారు .

 

SFI ఆందోళన ఉద్రిక్తం..

ఇద్దరు ఇంటర్‌ విద్యార్థునుల బలన్మరణానికి కారణమైన కడప జిల్లాలోని నారాయణ విద్యాసంస్థ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విద్యార్థుల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. గుంటూరులో పోలీసులు విద్యార్థులపై జులుం ప్రదర్శించారు. ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్‌, పిడిఎస్‌యు ఆధ్వర్యంలో గురువారం గుంటూరులో శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తుండగా పోలీసులు అడ్డుకుని దుర్భాషలాడారు. పిడిగుద్దులతో బీభత్సాన్ని సృష్టించారు. నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఒక విద్యార్థిని తనను ఆసుపత్రికి తీసుకెళ్లాలని అభ్యర్థించినా పోలీసులు పట్టించుకోలేదు. 29 మందిని అరెస్ట్‌ చేసి అరండల్‌పేట పోలీసు స్టేషన్‌కు తరలించారు.

ఆంధ్రాను ఆదుకోండి: ఏచూరి

విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని తక్షణమే ఆదుకోవాలని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి డిమాండ్‌ చేశారు. మంగళవారం ఆయన సిపిఎం ప్రధాన కార్యాలయం(ఎకెజి భవన్‌)లో విలేకరులతో మాట్లాడుతూ విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి నాటి ప్రభుత్వం పార్లమెంట్‌ సాక్షిగా ఎన్నో వాగ్ధానాలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ హామీలన్నింటిని అమలు చేయాలని కోరారు. పత్యేక హోదా రూపంలోనైనా, ప్రత్యేక ప్యాకేజి రూపంలోనైనా ఆర్థికంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను తక్షణమే ఆదుకోవాలన్నారు. ఏ విషయంలోనైనా ఒక రాష్ట్రాన్ని వేరే రాష్ట్రంతో పోల్చడం సబబుకాదన్నది తమ ఉద్దేశ్యమని చెప్పారు.

అక్రమ బాక్సైట్‌ తవ్వకాలు నిలిపివేయాలి..

 విశాఖలో బాక్సైట్‌ గనులను కొల్లగొట్టి రూ.లక్ష కోట్లు లూటీ చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని సిపిఎం నాయకులు జితేన్‌ చౌదరి ఆందోళన వ్యక్తంచేశారు. సోమవారం స్థానిక సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రస్‌ ఆల్‌ఖైమా, జిందాల్‌తో చేసుకున్న గత ఒప్పందాల్లో అవకతవకలు జరిగాయని, గతంలో సిపిఎం చెప్పిన విషయాన్నే కంట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) విడుదల చేసిన నివేదికలో పేర్కొందన్నారు. విశాఖ జిల్లాలో బాక్సైట్‌ ఖనిజం మొత్తం 550 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు ఉంటుందని, దీని విలువ సుమారు రూ.లక్ష కోట్లు ఉందని పేర్కొన్నారు.

Pages

Subscribe to RSS - August