August

రైతులకు న్యాయం చేయాలి:దడాల

కోరంగి భూముల ఘటనపై న్యాయం చేయాలని ఎస్‌పి రవిప్రకాష్‌, ముమ్మిడివరం ఎంఎల్‌ఎ దాట్ల బుచ్చిబాబు, కాకినాడ ఆర్‌డిఒ అంబేద్కర్‌లను అఖిలపక్షం నాయకులు మంగళవారం కలిసి వినతిపత్రం అందించారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు ఆధ్వర్యంలో రాజకీయ పార్టీలు, దళిత సంఘాల నాయకుల బృందం ముమ్మిడివరం ఎంఎల్‌ఎను కలిసి ఘటనా వివరాలను, పేదలకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. దీనికి స్పందించిన ఆయన పోలీసుల అత్యుత్సాహంపై ఎస్‌పితో మాట్లాడారు. ఆర్‌డిఒకు ఫోన్‌ చేసి భూములపై సర్వే చేసి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని విచారణ నిర్వహించాలన్నారు. 

SFI నాయకుల విడుదల..

నారాయణ కాలేజీ విద్యార్థినులు నందిని, మనీషారెడ్డి మృతికి కారణమైన వారిని వదిలేసి, న్యాయం కోసం పోరాడుతున్న వారిపై అక్రమ కేసులు బనాయించడం ఎంత వరకు సమంజసమని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి నూర్‌ మహమ్మద్‌ ప్రశ్నించారు. లాఠీలు, తూటాలు, అక్రమ అరెస్టులు ఉద్యమాలను ఆపలేవని హెచ్చరించారు. కడప నారాయణ కాలేజీలో విద్యార్థినుల మృతికి నిరసనగా ఆందోళన నిర్వహించిన ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఓబులేసు, జగదీష్‌, సుబ్బారెడ్డి, డివైఎఫ్‌ఐ నాయకులు శంకర్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వారు మంగళవారం జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం మహిళా పాలిటెక్నిక్‌ విద్యార్థినులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నూర్‌ మహమ్మద్‌ మాట్లాడుతూ..

సమ్మెతో కనువిప్పు కలగాలి..

సెప్టెంబర్‌ 2న జరిగే సమ్మెతో కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని అఖిలపక్ష కార్మిక సంఘాల నేతలు పేర్కొన్నారు. సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ కర్నూలు జిల్లా హిందూపురంలో ప్రారంభమైన బస్సు జాతా సోమవారం ఉత్తరాంధ్ర జిల్లాలయిన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో పర్యటించింది.

 

భారత్‌ పాక్‌ చర్చలే శరణ్యం..ఏచూరి

భారత్‌, పాకిస్తాన్‌ మధ్య ఎన్‌ఎస్‌ఎ స్థాయి చర్చలు రద్దుకావడం దురదృష్ట కరమని సిపిఎం అఖిలభారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. రెండు దేశాల మధ్య సరిహద్దుల్లోని ఉద్రిక్తతలను నివారించాలంటే భారత్‌ చర్చల ప్రక్రియను కొనసాగించాలని ఆయన తెలిపారు. భారత్‌, పాక్‌ మధ్య యుద్దోన్మాదం పెరగడం ఇరువైపుల మత ఛాందసవాద శక్తులు బలోపేతానికి దారితీస్తుందని, ఇది రెండు దేశాల ప్రజల ప్రయోజనాలకు విఘాతమని, ముఖ్యంగా జమ్మూకాశ్మీర్‌పై తీవ్ర ప్రభావం పడుతుందని ఆయన చెప్పారు.'వేర్పాటువాదులతో పాకిస్తాన్‌ దౌత్యవేత్తలు చర్చలు జరిపారనే కారణంతో భారత్‌ ఎన్‌ఎస్‌ఎ స్థాయి చర్చలను రద్దు చేసింది.

CRDA కార్యాలయాల ముట్టడి..

 రాజధాని ప్రాంతంలో గ్రామకంఠాలు, భూసేకరణపై సిపిఎం ఆధ్వర్యంలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని ఉండవల్లి, నవులూరుల్లోని క్రిడా కార్యాలయాలను స్థానికులు సోమవారం ముట్టడించారు. తుళ్లూరు మండలం దొండపాడులోని క్రిడా డిప్యూటీ కలెక్టర్‌ కార్యాలయానికి రాజకీయాలకతీతంగా రైతులు తాళాలేశారు. గ్రామకంఠాల పేరుతో గ్రామాలను ఖాళీ చేయాలనే కుట్ర జరుగుతోందని నినదిస్తూ అధికారులను ఘెరావ్‌ చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్తత ఏర్పడింది. సిపిఎం రాజధాని డివిజన్‌ కార్యదర్శి ఎం.రవి మాట్లాడుతూ, గ్రామాలను ఖాళీ చేయించేందుకే ప్రభుత్వం కుట్రపన్నిందన్నారు.

PACS లను ప్రభుత్వం కాపాడాలి.... సిపియం జిల్లా కార్యదర్శి కె.లోకనాధం

ఈ రోజు విశాఖ జిల్లా డి.సి.ఒ ఆఫీస్ వద్ద జరిగిన ధర్నాలో కె. లోకనాధం మాటలాడుతూ పి.ఎ.సి.ఎస్ ఉద్యోగులకు వెంటనే వేతన సవరణ చేయాలన్నారు. డి.సి.సి.బి నియామకాల్లో పి.ఎ.సి.ఎస్ కోట కొనసాగించాలని, రిటైర్ మెంట్ 60 సంవత్సరాలకు పొడిగించాలన్నారు.  పి.ఎ.సి.ఎస్ ఉద్యోగుల పోరాటాలకు సిపియం పార్టీ  ఎప్పుడు తన మద్దతు ఉంటుందని తెలియజేసారు. ప్రభుత్వం వెంటనే పి.ఎ.సి.ఎస్. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేసారు ....

ఉద్యోగుల డిమాండ్లు ...

నిత్యావసర ధరలు తగ్గించాలి:CPM

 ప్రభుత్వం నిత్యవసర ధరలు తగ్గిం చాలని కర్నూలు సిపిఎం జిల్లా కార్యదర్శి కె ప్రభాకర్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.  రాష్ట్రానికి, దేశానికి ఉల్లిని సరఫరా చేసే కర్నూలులోని బహిరంగ మార్కెట్‌లో ధర రూ.50లు పలుకుతుందని, కందిపప్పు కిలో రూ.100లకు దాటిపోయిందని, కూరగాయలు కొనలేని పరిస్థితిల్లో సామాన్యులు ఉన్నారని తెలిపారు.

37ఏళ్ళ తరువాతCPMనిర్మాణ ప్లీనం

 న్యూఢిల్లీ: పార్టీ నిర్మాణ నివేదికపై అఖిలభారత విస్తృతస్థాయీ సమావేశం (ప్లీనం) డిసెంబరులో కొల్‌కతాలో నిర్వహించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) నిర్ణయించింది. కోల్‌కతాలో ఈ తరహా ప్లీనం నిర్వహించడం 37 సంవత్సరాల తరువాత ఇదే మొదటిసారి. పార్టీ నిర్మాణ బలం, బలహీనతలను మదింపు వేసేందుకు జరిగే ఈ ప్లీనం ఏర్పాట్లపై ఆదివారం నాడిక్కడ ముగిసిన మూడు రోజుల కేంద్ర కమిటీ సమావేశాలలో విస్తృతంగా చర్చించారు.

Pages

Subscribe to RSS - August