
ప్రభుత్వం నిత్యవసర ధరలు తగ్గిం చాలని కర్నూలు సిపిఎం జిల్లా కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రానికి, దేశానికి ఉల్లిని సరఫరా చేసే కర్నూలులోని బహిరంగ మార్కెట్‌లో ధర రూ.50లు పలుకుతుందని, కందిపప్పు కిలో రూ.100లకు దాటిపోయిందని, కూరగాయలు కొనలేని పరిస్థితిల్లో సామాన్యులు ఉన్నారని తెలిపారు.