దేశంలో అమలవుతున్న సరళీకరణ విధానాల ద్వారా వ్వవసాయరంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిందని వ్వవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారంబ్రాడిపేటలోని సిపిఎం కార్యాలయం లో ఎపిరైతుసంఘం, వ్వవసాయక ార్మికసంఘం సంయుక్త అధ్వర్యంలో రైతుసంఘంజిల్లా కార్యదర్శి వై.రాధాకృష్ణ అధ్యక్షతన రౌండ్‌టెబుల్ సమావేశం నిర్వహించారు. వి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ .రైతుల అత్మహత్యలు పెరుగుతున్నాయని, వ్వవసాయ పనులు లేక రైతులు, రైతుకూలీలు, వలసలు వెళ్తున్నారన్నారు. గ్రామీణ ఉపాధిహామీ చట్టానికి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు తూట్లు పోడుస్తున్నాయని విమర్శించారు.