August

ఇస్లామాబాద్‌లో సార్క్‌ సదస్సు..

సార్క్‌ దేశాల 19వ సదస్సుకు ఇస్లామాబాద్‌ ఆతిథ్యమివ్వనుంది. నవంబరు 9, 10వ తేదీల్లో సదస్సు జరగనున్నట్లు పాకిస్థాన్‌ శుక్రవారం ప్రకటించింది. సభ్యదేశాల నేతలను తమ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది.

హెరాల్డ్ కేసులో సోనియా,రాహుల్

నేషనల్ హెరాల్డ్ కేసులో ఢిల్లీ కోర్టు ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు మరో ఐదుగురికి నోటీసులు జారీచేసింది. రెండు వారాలలోపు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. కేసు తదుపరి విచారణను అక్టోబరు 4వ తేదీకి వాయిదా వేసింది.

హర్యానా అసెంబ్లీలో దిగంబర బాబా.!!

జైన దిగంబర బాబా తరుణ్‌ సాగర్‌. హర్యానా వర్షాకాల అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఆయన సభను ఉద్దేశించి ప్రసంగించారు. నగ్నంగా సమావేశాలకు హాజరైన తరుణ్‌ సాగర్‌ బాబా గవర్నర్‌, సీఎం, ఎమ్మెల్యేల కన్నా ఎత్తైన డయాస్‌పై కూర్చొని ప్రసంగించారు. ఒక బాబా నగ్న అవతారంలో అసెంబ్లీలో ప్రసంగించడం ఇదే మొదటిసారి.

రామరాజ్య స్థాపనకు ఆదేశించలేం..

 దేశంలో ‘రామరాజ్యం’ స్థాపించేందుకు ఆదేశాలను ఇవ్వలేమని భారత ప్రధాన న్యాయమూర్తి టి.ఎస్‌.ఠాకూర్‌ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఎన్నెన్నో చేయాలని ఉన్నా తమకు గల ‘పరిమిత సామర్థ్యం’ మూలంగా చాలా పనులను చేయలేమని వ్యాఖ్యానించింది.

కన్నయ్యకు రెగ్యులర్‌ బెయిల్‌..

జేఎన్‌యూ విద్యార్థి నేత కన్నయ్యకుమార్‌ రెగ్యులర్‌ బెయిల్‌కు దాదాపుగా లైన్‌క్లియర్‌ అయినట్లే. మధ్యంతర బెయిల్‌పై విడుదలైన కన్నయ్య, ఉమర్‌ఖాలీద్‌, అనిర్భన్‌లు ఎక్కడ కూడా నిబంధనలను ఉల్లంఘించలేదని ఢిల్లీ పోలీసులు శుక్రవారం ఢిల్లీ కోర్టుకు తెలిపారు. దీంతో పాటు వారికి రెగ్యులర్‌ ఇవ్వడానికి పోలీసులు ఎలాంటి అభ్యంతరమూ తెలుపలేదు.

కాంట్రాక్ట్ ఉద్యోగుల ఆందోళనకు మద్దతు

కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో గత 15 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పద్దతిలో సేవలందిస్తున్న 240మంది ఉద్యోగులకు జి.వో 151 ప్రకారం కనీసవేతనాలు ఇవ్వాలని చేపట్టిన ఆందోళనకు మద్దతు ఇచ్చిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, సిపిఎం జిల్లా కార్యదర్శి దువ్వ శేషబాబ్జి .. రాష్ట్రముఖ్యమంత్రి దృష్టికి సమస్యను తీసుకువెళ్తానని, మిగిలిన వామపక్షాలను కలుపుకొని సమస్య పరిష్కరానికి ఉద్యమిస్తామని తెలిపారు...

Pages

Subscribe to RSS - August