అరకొరతో అభివృద్ధి ఎలా?

ఏపిికి కేంద్ర ప్రభుత్వం రూ 1,976 కోట్లు ఆర్థిక సహాయం ప్రకటించడంపై సిపిఐ రాష్ట్ర సమితి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అత్యల్ప నిధుల కేటాయింపులతో వెనుకబడ్డ జిల్లాల్లో అభివృద్ధి ఎలా సాధించగలమో తెలపాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రశ్నించారు.గత రెండేళ్ళలో ఏడాదికి రూ 350 కోట్లు చొప్పున రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు రూ 700 కోట్లు విడుదల చేశారని వివరించారు. రాజధాని నిర్మాణం కోసం కేటాయించిన రూ 450 కోట్లతో ఏ నిర్మాణాలు, ఎంతకాలంలో చేపడతారో తెలియడంలేదని విమర్శించారు. రాష్ట్ర రెవెన్యూలోటు రూ 16 వేట కోట్లు ఉండగా.. గతేడాది రూ 2,803 కోట్లు, ప్రస్తుతం రూ 1,976 కోట్లు రెండేళ్ళకు విడుదల చేయటం సమంజస కాదని పేర్కొన్నారు.