August

స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల ఆందోళనకు మద్దతు

విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించవద్దని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన నిర్వహించడానికి వెళ్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులను విజయవాడ రైల్వే స్టేషన్ లో కలిసి సంఘీభావం తెలుపుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు,కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు మరియు సిఐటియు నాయకులు..

గ్యాస్ ధర పెంపుపై నిరసన

కేంద్ర ప్ర‌భుత్వం వంట గ్యాస్ పై సబ్సిడీ ఎత్తివేయడాన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం నాయకులు విజ‌య‌వాడ‌లో నిరసన ప్ర‌ద‌ర్శ‌న‌ చేపట్టారు. నెలకు 4 రూపాయల చొప్పున గ్యాస్ రేటు పెంచడంపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు.గ్యాస్ పై సబ్సిడీని కొనసాగించాలని డిమాండ్ చేశారు. 

పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పించాలి

పోలవరం నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో న్యాయపరమైన పరిహారం, పునరావాసం కల్పించాలని కోరుతూ చింతూరు లో ర్యాలీ, చట్టివద్ద జాతీయ రహదారిపై బైఠాయింపు..ర్యాలీలో పాల్గోన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మిడియం బాబురావు, భద్రచలం ఎమ్మేల్యే సున్నం రాజయ్య..

దళితుల భూముల జోలికొస్తే ఖబడ్దార్‌

దళితుల భూముల జోలికొస్తే ఖబడ్దార్‌ అంటూ టిడిపి నాయకులను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు హెచ్చరించారు. ఒక్కసెంటు కూడా ఇతరులకు పోనివ్వబోమని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం యడవల్లిలో 40 ఏళ్ల కిందట దళితులకు కేటాయించిన 416 ఎకరాల సాగు భూమిని అధికార పార్టీ నాయకులు కాజేయాలని చూస్తున్న నేపథ్యంలో సంబంధిత పొలాలను మధు ఆధ్వర్యంలో శుక్రవారం పరిశీలించారు. ఈ భూములను 1975లో అప్పటి జిల్లా కలెక్టర్‌ కత్తి చంద్రయ్య దళితులను సొసైటీగా ఏర్పాటు చేసి భూమినిచ్చారు. ఇందులో గ్రానైట్‌ నిక్షేపాలున్నాయని తెలుసుకున్న అధికార పార్టీ నాయకులు.. ఈ భూములను కొట్టేయాలని అక్రమ రిజిస్ట్రేషన్లకూ పూనుకున్నారు.

ప్రజాసంఘాల కార్యాలయానికి శంకుస్థాపన

అమరజీవి పరుచూరి నాగేశ్వరరావు భవన్‌ ప్రజాసంఘాల ఉద్యమ కేంద్రంగా భాసిల్లాలని వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత అధ్యక్షులు పాటూరు రామయ్య అన్నారు. చెంచుపేటలో ప్రజా సంఘాల కార్యాలయ (కామ్రేడ్‌ పరుచూరి నాగేశ్వరరావు భవన్‌) నిర్మాణానికి ఆయన ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు సిఐటియు డివిజన్‌ అధ్యక్షులు ములకా శివసాంబిరెడ్డి అధ్యక్షత వహించారు. పాటూరు మాట్లాడుతూ పేరెన్నికగన్న ఎంతో మంది నాయకులు తెనాలి ప్రాంతంలో ఉన్నారని, వారిలో పరుచూరి నాగేశ్వరరావు ఒకరని చెప్పారు.

Pages

Subscribe to RSS - August