August

కృష్ణా జిల్లా కిడ్నీ వ్యాధి సమస్యలపై ధర్నా..

పశ్చిమ కృష్ణా ప్రాంతంలో కిడ్నీ వ్యాధిని నియంత్రించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో విజయవాడ ధర్నాచౌక్‌ వద్ద బాధితులు ధర్నా చేశారు. వ్యాధి వల్ల తాము ఎక్కువ సేపు కూర్చోలేని పరిస్థితి ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి తమకు చేయూత లేకపోవడంతో ఆందోళన చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ బాబూరావు మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రగా చేస్తానన్న సిఎం చంద్రబాబునాయుడు మరింత రోగాంధ్రగా మారుస్తున్నారని ధ్వజమెత్తారు. పశ్చిమ కృష్ణాలో కిడ్నీ వ్యాధి సమస్య ఉందని ప్రభుత్వం దృష్టికి వచ్చినా నియంత్రణకు చర్యలు తీసుకోలేదన్నారు.

ప్రజాసమస్యల పరిష్కారానికి కేంద్రంగా సుందరయ్యభవన్‌

కామ్రేడ్‌ పుచ్చలపల్లి సుందరయ్య భవన్‌ ప్రజాసంఘాల కార్యాలయం ప్రజా సమస్యల పరిష్కారానికి జరిగే ప్రజా ఉద్యమాలకు కేంద్రంగా పనిచేస్తుందని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు అన్నారు. నకరికల్లు మండలం చేజర్ల గ్రామంలో సిపిఎం గ్రామశాఖ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన పుచ్చలపల్లి సుందరయ్య భవన్‌ ప్రజాసంఘాల కార్యాలయాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపిఎం జెండాను రాష్ట్ర కమిటీ సభ్యులు గద్దె చలమయ్య ఆవిష్కరించారు. సుందరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభా కార్యక్రమానికి గాడిదమళ్ల వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు.

సేవ్‌ పబ్లిక్‌ సెక్టార్‌ - సేవ్‌ విశాఖ

ప్రభుత్వరంగ పరిశ్రమల పరిరక్షణ, విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ సాధనకు విశాఖ జిఎంవిసి గాంధీ విగ్రహం వద్ద 'సేవ్‌ పబ్లిక్‌ సెక్టార్‌-సేవ్‌ విశాఖ' పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించారు. సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు మాట్లాడుతూ విశాఖ నగరంలోని ప్రభుత్వరంగ సంస్థలను బిజెపి ప్రభుత్వం ప్రయివేటీకరణకు పూనుకుందని, రైల్వే జోన్‌ ఇవ్వకుండా ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సొంతగనులు కేటాయించకుండా 10 నుంచి 20 శాతం షేర్లను విక్రయించడానికి కేంద్రం ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తెలిపారు.

స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల ఆందోళనకు మద్దతు

విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించవద్దని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన నిర్వహించడానికి వెళ్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులను విజయవాడ రైల్వే స్టేషన్ లో కలిసి సంఘీభావం తెలుపుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు,కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు మరియు సిఐటియు నాయకులు..

Pages

Subscribe to RSS - August