రేపల్లె పట్టణంలో ప్రజా సమస్యలపై.. "సీపీఎం పాదయాత్ర"

రేపల్లె పట్టణంలో ప్రజా సమస్యలపై.. "సీపీఎం వార్డులలో పాదయాత్ర" పేదలు నివాసాలు ఉంటున్న ఏరియాలో పేదలు వద్దకు వెళ్లి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకోవటం జరుగుతుందిని సిపిఎం రేపల్లె డివిజన్ కార్యదర్శి సి.హెచ్.మణిలాల్ తెలిపారు.ఇ ప్రజా సమస్యల పాదయాత్ర గురించి మణిలాల్ మాట్లాడుతు ఉదయం 21 వార్డులోని తేజ కాలనీ నుండి ప్రారంబిచి పలు వార్డులులో ప్రధానంగా పేదలు సమస్యలు అడిగి తెలుసుకోవటం జరిగింది.ఇళ్ళస్థలాలు అర్హులు లిస్టులో ఇప్పుడు అపార్టుమెంట్స్ నిర్మిస్తున్న 1344 మందిలో నిజంగా పేదలుగా ఉన్న మా పేర్లు లేవు అని 19 వార్డులో సోసైటీ భూములో 30 ఏళ్లుగా గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్న పేదలు వాపోయారు,అలానే 21,20 వార్డులో అద్దెలకు ఉంటున్న ముస్లిము కుటంబాలు పేర్లు కోడా రాజకీయ కారణాలుతో ఇవ్వటం లేదు అన్నారు,కనీసం రేషన్ కార్డ్స్ కోడా ఇవ్వకుండా ప్రతి జన్మభూమిలో అర్జీలు పెట్టించారు కొంత మందికి రేషన్ కార్డ్స్ ఇవ్వకుండా కేవలం నెంబర్లు ఇచ్చారు కొని సందర్బాలో రేషన్ కార్డ్స్ లేక ఇబ్బంది పడుతున్నాము, మరియు దోమలు విపరీతంగా కుడుతున్న పట్టిచుకొన్నే వాళ్ళు లేరు దోమలు మందు పాగింగ్ చేయటం లేదు అంటున్నారు.ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకొని నివసిస్తున్న వారికీ మరుగుదొడ్లు నిర్మించుకోవటానికి కోడా అనుమతి ఇవ్వటం లేదు.మహిళలు ఎక్కడికి వెళ్ళాలి, మంచినీళ్లు పబ్లిక్ కుళాయిలు వేయమని అడుగుతుంటే ఇప్పుడు ఆపివేశాము అంటున్నారు.తెల్ల రేషన్ కార్డు వాళ్ళకి 250 రు మంచినీటి కనక్షన్ ఇస్తామంటూ ఇంటిపన్ను 500 కి మించకోడదు అనే నిబంధనతో పేదలు గా ఉన్న వారికి కొడ 7000 రూపాయలు చెలించి తీసుకోమనటంతో పేదలు మంచినీళ్లు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి,జె.ల్.బి కాలేజి బజారులో 20,19 వార్డ్స్ లో అడ్డ బజారులో సిమెంట్ రోడ్డులు,డ్రైనేజి నిర్మాణాలు చేయకుండా మిగిలిపోయిన బజారు వాళ్ళు ఎన్ని సారులు అధికారులకి చెప్పినా పట్టిచుకోవటం లేదు అని వివిధ సమస్యలుని పేదలు పాదయాత్ర చేస్తున్న సిపిఎం బృదనికి ముందు తెలియచేసారు. ప్రజలు సమస్యలు పట్టిచుకోకుండా నిత్యం పన్నులు పెంచి వసూలు చేస్తున్నారుని విమర్శించారు.ఇ యాత్రలో వచ్చినా సమస్యలు పరిష్కరం కోరుకు ఆగస్టు 27 నా మున్సిపాల్ కార్యాలయం వద్దకి ఆర్జీలతో ప్రజలు రావాలని పిలుపునిచ్చారు.