August

దళితుల భూముల జోలికొస్తే ఖబడ్దార్‌

దళితుల భూముల జోలికొస్తే ఖబడ్దార్‌ అంటూ టిడిపి నాయకులను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు హెచ్చరించారు. ఒక్కసెంటు కూడా ఇతరులకు పోనివ్వబోమని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం యడవల్లిలో 40 ఏళ్ల కిందట దళితులకు కేటాయించిన 416 ఎకరాల సాగు భూమిని అధికార పార్టీ నాయకులు కాజేయాలని చూస్తున్న నేపథ్యంలో సంబంధిత పొలాలను మధు ఆధ్వర్యంలో శుక్రవారం పరిశీలించారు. ఈ భూములను 1975లో అప్పటి జిల్లా కలెక్టర్‌ కత్తి చంద్రయ్య దళితులను సొసైటీగా ఏర్పాటు చేసి భూమినిచ్చారు. ఇందులో గ్రానైట్‌ నిక్షేపాలున్నాయని తెలుసుకున్న అధికార పార్టీ నాయకులు.. ఈ భూములను కొట్టేయాలని అక్రమ రిజిస్ట్రేషన్లకూ పూనుకున్నారు.

ప్రజాసంఘాల కార్యాలయానికి శంకుస్థాపన

అమరజీవి పరుచూరి నాగేశ్వరరావు భవన్‌ ప్రజాసంఘాల ఉద్యమ కేంద్రంగా భాసిల్లాలని వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత అధ్యక్షులు పాటూరు రామయ్య అన్నారు. చెంచుపేటలో ప్రజా సంఘాల కార్యాలయ (కామ్రేడ్‌ పరుచూరి నాగేశ్వరరావు భవన్‌) నిర్మాణానికి ఆయన ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు సిఐటియు డివిజన్‌ అధ్యక్షులు ములకా శివసాంబిరెడ్డి అధ్యక్షత వహించారు. పాటూరు మాట్లాడుతూ పేరెన్నికగన్న ఎంతో మంది నాయకులు తెనాలి ప్రాంతంలో ఉన్నారని, వారిలో పరుచూరి నాగేశ్వరరావు ఒకరని చెప్పారు.

గిరిజనుల సమస్యలపై చలో ఐటిడిఎ..

గిరిజనుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సెప్టెంబర్‌ 7న జరిగే చలో ఐటిడిఎ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.కృష్ణమూర్తి కోరారు. ఈసందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ ఈనెల 7న చలో ఐటిడిఎ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత దుర్మార్గంగా లక్షల మంది గిరిజనులను, ఇతర పేదలను జలసమాధి చేయడానికి పూనుకున్నా యన్నారు. 12 ఏళ్లుగా 12 గ్రామాలకు పునరావాసం కల్పించలేని ప్రభుత్వం 2018 నాటికి 400 గ్రామాలకు పునరావాసం ఎలా కల్పిస్తారని ప్రశ్నించారు.

అమరావతి..ఓ భ్రమరావతి..

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనేక వివాదాలకు కారణమవుతోందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. రాజధాని నిర్మాణం పేరుతో జరుగున్న అక్రమాలు, అన్యాయాలపై 'భ్రమరావతి' పేరుతో ఆయన బుక్లెట్ విడుదల చేశారు. ఈ బుక్లెట్ చవిదిన వారికి అమరావతి.. భ్రమరావతిగా కనిపిస్తుందని చెప్పారు. అనేక వర్గాల నుంచి సమాచారం సేకరించి ఈ బుక్లెట్ తయారు చేసినట్టు వెల్లడించారు. 

ఇస్లామాబాద్‌లో సార్క్‌ సదస్సు..

సార్క్‌ దేశాల 19వ సదస్సుకు ఇస్లామాబాద్‌ ఆతిథ్యమివ్వనుంది. నవంబరు 9, 10వ తేదీల్లో సదస్సు జరగనున్నట్లు పాకిస్థాన్‌ శుక్రవారం ప్రకటించింది. సభ్యదేశాల నేతలను తమ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది.

హెరాల్డ్ కేసులో సోనియా,రాహుల్

నేషనల్ హెరాల్డ్ కేసులో ఢిల్లీ కోర్టు ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు మరో ఐదుగురికి నోటీసులు జారీచేసింది. రెండు వారాలలోపు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. కేసు తదుపరి విచారణను అక్టోబరు 4వ తేదీకి వాయిదా వేసింది.

హర్యానా అసెంబ్లీలో దిగంబర బాబా.!!

జైన దిగంబర బాబా తరుణ్‌ సాగర్‌. హర్యానా వర్షాకాల అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఆయన సభను ఉద్దేశించి ప్రసంగించారు. నగ్నంగా సమావేశాలకు హాజరైన తరుణ్‌ సాగర్‌ బాబా గవర్నర్‌, సీఎం, ఎమ్మెల్యేల కన్నా ఎత్తైన డయాస్‌పై కూర్చొని ప్రసంగించారు. ఒక బాబా నగ్న అవతారంలో అసెంబ్లీలో ప్రసంగించడం ఇదే మొదటిసారి.

రామరాజ్య స్థాపనకు ఆదేశించలేం..

 దేశంలో ‘రామరాజ్యం’ స్థాపించేందుకు ఆదేశాలను ఇవ్వలేమని భారత ప్రధాన న్యాయమూర్తి టి.ఎస్‌.ఠాకూర్‌ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఎన్నెన్నో చేయాలని ఉన్నా తమకు గల ‘పరిమిత సామర్థ్యం’ మూలంగా చాలా పనులను చేయలేమని వ్యాఖ్యానించింది.

కన్నయ్యకు రెగ్యులర్‌ బెయిల్‌..

జేఎన్‌యూ విద్యార్థి నేత కన్నయ్యకుమార్‌ రెగ్యులర్‌ బెయిల్‌కు దాదాపుగా లైన్‌క్లియర్‌ అయినట్లే. మధ్యంతర బెయిల్‌పై విడుదలైన కన్నయ్య, ఉమర్‌ఖాలీద్‌, అనిర్భన్‌లు ఎక్కడ కూడా నిబంధనలను ఉల్లంఘించలేదని ఢిల్లీ పోలీసులు శుక్రవారం ఢిల్లీ కోర్టుకు తెలిపారు. దీంతో పాటు వారికి రెగ్యులర్‌ ఇవ్వడానికి పోలీసులు ఎలాంటి అభ్యంతరమూ తెలుపలేదు.

Pages

Subscribe to RSS - August